
దిల్లీ: న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలకు సంబంధించి కొలీజియాల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా సమస్యల తేనెతుట్టెను కదపదలచుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
హైకోర్టు జడ్జి పోస్టులకు తన కన్నా జూనియర్ల పేర్లను ప్రతిపాదించారని, తన పేరును ఆ జాబితాలో చేర్చలేదంటూ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘ఇలా చేయాలనిగానీ... ఫలానా పేరును పరిశీలించాలనిగానీ హైకోర్టులు, సుప్రీంకోర్టు కొలీజియాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించదు. వాటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోదు’’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ ధర్మాసనం స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.