
హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన 9 ఏళ్ల వి.సిరి అత్షా అద్భుతమైన ఘనత సాధించింది. ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలతో అత్యంత సాహసోపేతమైన ట్రెక్కింగ్ పర్వతంగా పిలిచే లద్దాక్‌లోని ఉమ్లింగ్ లా పాస్...
హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన 9 ఏళ్ల వి.సిరి అత్షా అద్భుతమైన ఘనత సాధించింది. ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదలతో అత్యంత సాహసోపేతమైన ట్రెక్కింగ్ పర్వతంగా పిలిచే లద్దాక్‌లోని ఉమ్లింగ్ లా పాస్ పర్వతాన్ని అధిరోహించి.. అతిపిన్న వయస్కురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 7న 13,800 అడుగుల ఎత్తులో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని సర్ పాస్ పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించింది. కసోల్ నుంచి బర్షైని వరకు 48 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ను పూర్తిచేసిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని ఎస్ఆర్ డిజి పాఠశాలలో మూడో తరగతి పూర్తిచేసిన సిరిని.. వేసవి సెలవుల్లో అమ్మ నవ్యశ్రీ దూర ప్రయాణాలకు తీసుకెళ్లేవారు. అలా పర్వతాలపై మక్కువ పెంచుకుని ‘హలో హైకర్స్’ అనే హైకర్ల బృందంలో సభ్యురాలై.. 23 మందితో కలిసి సర్ పాస్ పర్వతాన్ని అధిరోహించడానికి యాత్రకు వెళ్లి ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటివరకు షింకులా పాస్ పర్వతం, చంద్రతాల్ పర్వతం, స్పితి వ్యాలీ పర్వతంతో పాటు మరికొన్నింటిని ట్రెక్కింగ్ చేసినట్లు చిన్నారి పేర్కొంది. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సిరి వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.