
"ఈ రోజు నేను మీ ముందు ఒక నటుడిగానో, ప్రజాప్రతినిధిగానో నిలబడలేదు. ఒక కొడుకుగా ఈ వేదికపై ఉన్నాను" అంటూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, నందమూరి బాలకృష్ణ తన ప్రసంగాన్ని...
"ఈ రోజు నేను మీ ముందు ఒక నటుడిగానో, ప్రజాప్రతినిధిగానో నిలబడలేదు. ఒక కొడుకుగా ఈ వేదికపై ఉన్నాను" అంటూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, నందమూరి బాలకృష్ణ తన ప్రసంగాన్ని భావోద్వేగభరితంగా ప్రారంభించారు. ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్తో పోరాడుతున్న రోజులను గుర్తుచేసుకుంటూ, ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాన్ని వివరించారు.1984లో తన తల్లి క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, తమకు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత ఉందని, కానీ చుట్టూ ఉన్న ఎందరో నిస్సహాయులను చూసి తన తల్లి ఆవేదన చెందారని బాలకృష్ణ తెలిపారు. "డబ్బులున్న మనం చికిత్స చేయించుకోగలుగుతున్నాం, మరి పేదల పరిస్థితి ఏంటి?" అని తన తల్లి అడిగిన ఒక సామాన్యమైన ప్రశ్నే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది వేసిందన్నారు. ఆ ప్రశ్నను తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక బాధ్యతగా స్వీకరించి, డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్కరూ క్యాన్సర్ చికిత్సకు దూరం కాకూడదన్న లక్ష్యంతో 1989లో ఈ సంస్థకు పునాది వేశారని గుర్తుచేసుకున్నారు.2000వ సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి, నేడు 650 పడకల ప్రపంచ స్థాయి వైద్యశాలగా ఎదిగిందని బాలకృష్ణ వివరించారు. ప్రతిరోజూ 35 నుంచి 40 సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు, 200 మందికి పైగా కీమోథెరపీ, దాదాపు 500 మందికి రేడియేషన్