.webp&w=3840&q=75)
హైదరాబాద్లోని మియాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూరి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రణవి (20) భవనం ఐదో అంతస్తులోని పిట్టగోడపై కూర్చుని ఫోన్లో మాట్లాడుతోంది.
ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భారీ ఎత్తు నుంచి కిందపడటంతో ప్రణవికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, అపార్ట్మెంట్ నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం !
.