
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026 టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ ఓపెనర్, కెప్టెన్ అమన్ రావు పేరాల విధ్వంసం సృష్టిస్తున్నాడు.
అమన్ 32 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాదేసిన అమన్.. తర్వాత కూడా జోరు కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఆరో ఓవర్లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 4, 6, 6, 4, 6, 6 బాదేశాడు. ఈ క్రమంలోనే 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ వేసిన ఏడో ఓవర్లో చివరి మూడు బంతులకు వరుసగా 6, 4, 4 కొట్టాడు. రవితేజ వేసిన ఎనిమిదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సాయి వరుణ్ బౌలింగ్‌లో (9.4 ఓవర్) ఫోర్ బాది అమన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket)2026లో భాగంగా సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.