
పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపడానికి వేగం (Speed), స్థిరత్వం (Stability), సేవ (Service) అనే మూడు “S”లే ప్రధాన కారణమని, అవే తమ ప్రభుత్వ విజయ రహస్యాలని రాష్ట్ర విద్య, ఐటీ,...
పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపడానికి వేగం (Speed), స్థిరత్వం (Stability), సేవ (Service) అనే మూడు “S”లే ప్రధాన కారణమని, అవే తమ ప్రభుత్వ విజయ రహస్యాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్ సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. ఏపీ అభివృద్ధి ప్రణాళిక, తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను జాతీయ వేదికపై సమగ్రంగా వివరించారు.ఆర్నబ్ గోస్వామి ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలుఈ చర్చను ఆర్నబ్ గోస్వామి తన పాత జ్ఞాపకాలతో ప్రారంభించారు. "మీ తండ్రి చంద్రబాబు గారు 90వ దశకం చివర్లో కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పట్లో మాతో చాలా చనువుగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మీలో మీ నాన్నగారి పోలికలు, అదే ఆకర్షణ కనిపిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ప్రజలు మరింత దగ్గరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ లోకేశ్ ను సంభాషణలోకి ఆహ్వానించారు.మీ రాజకీయ ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?ఆర్నబ్ అడిగిన ఈ ప్రశ్నకు లోకేశ్ బదులిస్తూ, "ఇదొక అద్భుతమైన ప్రయాణం. రాజకీయమనేది గమ్యం కాదు, ఒక నిరంతర ప్రయాణం. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకు ఇంకా 40-50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది. గత పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు, పరాజయాలను సమానంగా