
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రేయసి వైష్ణవిని వివాహం(Shanmukh Jaswanth Marriage) చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షణ్ముఖ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.