
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఆయనికి తప్ప ఎవరికీ తెలీదు. ఆయన చెయ్యాలి అనుకుంటే షూటింగ్ ఆ రోజు ఉంటుంది.
అలాగే, సడెన్ గా రాజకీయాలు అంటూ నెలల తరబడి సినిమా షూటింగ్ ని గాలికొదిలేస్తారు. మళ్ళీ సడెన్ గా షూటింగ్ కి ఓకే ఆయన చర్యలు ఊహాతీతమే.
అందుకే ఇంతకుముందే ప్రకటించిన సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి – పవన్ కళ్యాణ్ సినిమా ఇంతవరకు మొదలు కాలేదు. ఇప్పుడు “ఓజీ 2” (OG 2) అంటూ ట్వీట్స్ వేస్తూ హడావుడి చేస్తోంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. పవన్ కళ్యాణ్ నటించే “ఓజీ 2″కి మామూలు హైప్ ఉండదు అని అందరికీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.
“ఓజీ 2” ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు కానీ అది పక్కాగాలాంచ్ అవడం గ్యారెంటీ. మరి సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు ఉంటుంది? అది మొత్తానికే అటకెక్కిందా?
ఆ విషయంలో క్లారిటీ లేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న కమిట్ మెంట్ ని నెమ్మదిగానైనా పూర్తి చేస్తారు. హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు అలాగే పూర్తి చేశారు. కాకపోతే, ఏది ముందుకి వస్తుంది, ఏది వెనక్కి వెళ్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. అది పూర్తిగా ఆయన నిర్ణయమే. సో, సురేందర్ రెడ్డ్ (Surender Reddy) సినిమా కూడా అటకెక్కే అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్పలేం.