మేష రాశి వారికి ఈ వారం త్రిగ్రాహి యోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ వారం ప్రారంభంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. మీ వ్యాపార భాగస్వామితో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరుపుతారు. వారం చివర్లో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆర్థిక లేదా కుటుంబ విషయాలలో కోపం లేదా అతిగా భావోద్వేగానికి గురికాకుండా చూసుకోవాలి. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకుని, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు ‘‘ఓం మంగళాయ నమః’’అనే మంత్రాన్ని జపించాలి.
వృషభ రాశి వారికి ఈ వారం బుధ, గురు, శుక్ర గ్రహాల అనుగ్రహంతో తమ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈ వారం మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. మీకిష్టమైన పనులు చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వారం చివర్లో మీ జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. భూమి, ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు లభిస్తాయి.
పరిహారం : మీ ఇంట్లో శాంతి కోసం ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి.
మిథున రాశి వారికి జూన్ నాలుగోవారంలో మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి మీరు ప్రత్యర్థులు లేదా పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఊహలపై ఆధారపడకుండా, పూర్తిగా ఆచరణాత్మక విధానంతో ముందుకు సాగాలి. పరిహారం : ప్రతిరోజూ ‘‘ఓం బుధాయ నమః’’ అనే జపించాలి.
కర్కాటక రాశి వారు ఈ వారం గురు, శుక్ర గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావాలంటే మరింత కష్టపడాలి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. వారం మధ్యలో ఎదురుచూస్తున్న శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. పరిహారం : సోమవారం రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి భగవంతుడికి తెల్లని పూలు సమర్పించాలి.
సింహ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి. త్రిగ్రాహి యోగం ప్రభావంతో మీ వ్యక్తిగత జీవితంలో గణనీయమైన మార్పులొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా చిన్న పొరపాటు లేదా అజాగ్రత్త వల్ల పెద్ద సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యాపారులు ఈ వారం ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలు రావొచ్చు. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. పరిహారం : ప్రతిరోజూ ఇంటి నుంచి బయలుదేరే ముందు పెద్దలను గౌరవించి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
కన్య రాశి వారు జూన్ నాలుగో వారంలో అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మొదట్లో మీకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యలో మీ ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంపై మీరు శ్రద్ధ వహిస్తారు. వారం చివర్లో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మీరు కొత్త ఆలోచనలపై పని చేయొచ్చు. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ వారంలో మీ ప్రణాళిక బద్ధమైన పనులలో అకస్మాత్తుగా మార్పులు చేయాల్సి వస్తే, చిరాకు పడకండి, అందుకు బదులుగా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. పరిహారం : ‘‘ఓం నమో భగవతే వాసుదావాయ నమః’’మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి.
తులా రాశి వారికి ఈ వారం తాము చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. అయితే మీరు పనులు చేసే సమయంలో విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించాలి. ఈ సమయంలో మీరు ఏకాంతంగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వారం మధ్యలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇతరులతో ధైర్యంగా మాట్లాడగలరు. మీ సంబంధాలను బలపరచగలరు. మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ వారం ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. చాలా ప్రశాంతంగా ఉంటూ మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి. పరిహారం : ఈ వారం ఏదైనా ఆలయంలో లేదా మీ ఇంటి పూజా గదిలో సువాసన వెదజల్లే పూలను సమర్పించాలి.
వృశ్చిక రాశి వారికి జూన్ నాలుగో వారంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి, భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు వేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో స్నేహితులను భాగస్వాములను చేయాలి. అందరూ కలిసి పని చేయడం వల్ల ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు లేదా కొత్త అడుగు వేసే ముందు ఒక్క క్షణం ఆగి, లోతైన శ్వాస తీసుకుని, ప్రశాంతంగా ఆలోచించాలి. పరిహారం : మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి హనుమంతుడికి ఎర్రని పువ్వులు సమర్పించి, పూజలు చేయాలి.
ధనస్సు రాశి వారు ఈ వారం ప్రారంభంలో శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ శక్తి, సామర్థ్యాలను పెంచుకునే అవకాశం ఉంది. ఇది మీ పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. వారం మధ్యలో మీకు స్నేహితులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారం మధ్యలో స్నేహితులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పరిహారం : ప్రతిరోజూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.
మకర రాశి వారు ఈ వారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ తెలివితేటలను పెంచుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో కలవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. నిజాయితీ మాట్లాడే మీ అలవాటు వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి. పరిహారం: శనివారాల్లో శని దేవుని ఆశీస్సుల కోసం భగవంతుడికి నల్ల నువ్వులు దానం చేయాలి.
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి