
విలాసవంతమైన ఇళ్ల ఇంటీరియర్ డిజైన్ రంగంలో సరికొత్త ట్రెండ్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయించిన నునుపైన, మెరిసే ఉపరితలాల స్థానంలో ఇప్పుడు అందరి దృష్టి 'టెక్స్చర్' వైపు...
విలాసవంతమైన ఇళ్ల ఇంటీరియర్ డిజైన్ రంగంలో సరికొత్త ట్రెండ్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయించిన నునుపైన, మెరిసే ఉపరితలాల స్థానంలో ఇప్పుడు అందరి దృష్టి 'టెక్స్చర్' వైపు మళ్లుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... కేవలం చూడటానికే కాకుండా, చేతితో తాకినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చే మెటీరియల్స్ వినియోగం ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఏమిటీ టెక్స్చర్డ్ సర్ఫేస్లు?టెక్స్చర్డ్ సర్ఫేస్లు అంటే ఉపరితలంపై ఉండే చిన్నపాటి గీతలు, నమూనాలు, సహజమైన నిర్మాణాలు. ఉదాహరణకు, లైమ్ ప్లాస్టర్ వేసిన గోడలు, బ్రష్డ్ వుడ్, ఫ్లూటెడ్ కాంక్రీట్, చేతితో చేసిన టైల్స్, నేసిన ఫ్యాబ్రిక్స్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇవి కాంతిని నేరుగా ప్రతిబింబించకుండా, నెమ్మదిగా అన్ని వైపులకూ విస్తరింపజేస్తాయి. దీనివల్ల ఇంటి లోపల ప్రశాంతమైన, ఆకర్షణీయమైన వాతావరణం ఏర్పడుతుంది. రోజులో వేర్వేరు సమయాల్లో వెలుతురు మారినప్పుడల్లా ఈ ఉపరితలాలు కొత్తగా కనిపిస్తాయి.ఎక్కడెక్కడ వాడుతున్నారంటే..గోడలు, ఫ్లోరింగ్: మెరిసిపోయే పాలిష్డ్ ఫినిషింగ్ స్థానంలో ఇప్పుడు బ్రష్డ్ హార్డ్‌వుడ్, నాచురల్ స్టోన్, టెర్రాజో, చేతితో తయారుచేసిన టైల్స్ ఫ్లోరింగ్ కోసం వాడుతున్నారు. ఇవి నడవడానికి సౌకర్యంగా ఉండటమే కాక, ఇంటికి సహజమైన వెచ్చదనాన్ని అందిస్తాయి. ఇక గోడల విషయానికొస్తే, లైమ్‌వాష్ పెయింట్, వెనీషియన్ ప్లాస్టర్, మైక్రోసిమెంట్ వంటివి గోడలకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తున్నాయి. సాధారణ రంగులు వేసినప్పటికీ, ఈ టెక్స్చర్ వల్ల గోడలు బోసిగా కనిపించకుండా, లోతైన అందంతో నిలుస్తాయి.ఫసాడ్, సీలింగ్స్: ఇంటి బయటి గోడలకు (ఫసాడ్) ఫ్లూటెడ్ కాంక్రీట్,