
ఇంటర్నెట్ డెస్క్: హోమీ అదజానియా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), తారలు రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాక్టైల్ 2’...
ఇంటర్నెట్ డెస్క్: హోమీ అదజానియా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), తారలు రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాక్టైల్ 2’ (Cocktail 2). ఈ సినిమా జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. తొలి వీకెండ్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ వారాంతంలో పెద్ద హిందీ సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ‘కాక్టైల్ 2’కు పోటీ లేదు. దీంతో మెట్రో నగరాలు, అర్బన్ సెంటర్లలో యువత పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చారు. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
‘‘2026లో విడుదలై తొలి వీకెండ్లో రూ.50 కోట్లు దాటిన హిందీ సినిమాలు వేళ్లపై లెక్కపెట్టినన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో ‘కాక్టైల్ 2’ ఒకటిగా నిలిచింది. #Cocktail2 తొలి వీకెండ్లోనే హాఫ్ సెంచరీ కొట్టింది. శని, ఆదివారాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. యువత ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఆదరించారు. శుక్రవారం రూ.14.10 కోట్లు, శనివారం రూ.17.15 కోట్లు, ఆదివారం రూ.18.85 కోట్లు వసూలు చేసింది’’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అగ్ర కథానాయకుడు చిరంజీవితో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు.