
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియా ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎనిమిది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే పలువురు విద్యార్థులు భవనంలో చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది.
విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు