
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు.
అరుణ్ స్వస్థలం మహబూబ్నగర్. ప్రస్తుతం ఫ్లోరిడాలోని టెంపాలో నివసిస్తోన్న అతడు.. స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)లో ఉన్నాడు. ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోన్న అరుణ్.. జూన్ 19న ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.