
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Balakrishna - Koratala Siva:నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ 2 తాండవం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమా పలు రికార్డులను తిరగ రాసింది. రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన 5వ బాలయ్య సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు యూఎస్ మార్కెట్లో 6 వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సీనియర్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.
గోపీచంద్ మలినేని సినిమాలో ముంబై డాన్‌గా బాలయ్య.. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ సినిమా చేస్తున్నాడు. 1990 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కే ఈ చిత్రంలో బాలయ్య మరోసారి ముంబై డాన్‌గా కనిపించనున్నాడు. గతంలో ‘అశోక చక్రవర్తి’ సినిమాతో ముంబై డాన్‌గా నటించిన బాలయ్య.. ఇపుడు మరోసారి ముంబై డాన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలిపే అవకాశాలున్నట్టు సమాచారం.
కొరటాల శివ సినిమాకు ముహూర్తం ఖరారు.. ఆ సినిమా సెట్స్ పైకి ఆ సినిమా చేస్తూనే కొరటాల శివ దర్శకత్వంలో తర్వాతి చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను ఈ నెల 25న . ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో సీనియర్ హీరో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వెంకటాపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు ఏపీ మంత్రి నారా లోకేష్‌తో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయిక మొదలు ఎవరెవరు నటిస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు.
పవర్ఫుల్ బాలయ్య.. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో పవర్ అనేది ఒక లక్ష్యానికి ఉపయోగపడాలి. అపుడే ప్రజలకు తమకు తోచిన సాయం చేయాలనే సందేశం ఈ సినిమా పోస్టర్లో చూపించాడు. బాలయ్య మార్క్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ సినిమా ఉండనుంది. ఇందులో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతనుట్టు సమాచారం. ఈ సినిమాలో ఒకప్పటి యాంగ్రీ మ్యాన్ యాక్షన్ హీరో డాక్టర్ రాజశేఖర్.. బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన నటిస్తున్నాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనేది జూన్ 25న ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.