
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Son brutally kills mother over water dispute in pithapuram Kakinada: ఇటీవల కొంత మంది సమాజంలో సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కొంత మంది తాగిన మైకంలో దాడులు చేస్తుంటే , మరికొంత మంది ఆర్థిక పరమైన గొడవలతో రక్తసంబంధాల్ని కూడా మర్చిపోతున్నారు. సొంత తల్లిదండ్రులు, కట్టుకున్న వాళ్లు అని కూడా చూడకుండా దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలో కన్నతల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుతారు.
తల్లి నవమాసాలు తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుని బిడ్డను జన్మనిస్తుంది. తండ్రి తన పిల్లలకు ఏది అడిగిన లేదనకుండా ఇవ్వడానికి తన రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురంలో చోటు చేసుకున్న ఘటన అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
కాకినాడలో జిల్లాలోని పిఠాపురం మండలంలోని చిత్రాడకు చెందిన పెంటా త్రిమూర్తులు, నాగమణి (45) దంపతులకు ఇద్దరు కుమారులు. త్రిమూర్తులు కూరగాయల వ్యాపారం చేస్తు తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిన్న కుమారుడు రాజబాబు తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నెల 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజబాబుకు తల్లి నాగమణి భోజనం వడ్డించగా.. తనకు వెంటనే తింటూ ఫ్రిజ్‌లో చల్లటి మంచినీళ్లు తేవాలని ఆమెకు చెప్పాడు.
ఇంతలో కోపంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు లేచి తన తల్లిని నానా బూతులు తిడుతూ.. మరో గదిలో ఉన్న ఫ్రిజ్ వద్దకు వెళ్లి, మంచినీటి బాటిల్ తేవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అక్కడున్న గొడ అతనికి తాకింది. దీంతో కోపంతో తనకు దెబ్బ తగిలిందని మరింత రెచ్చిపోయి తన తల్లిని జుట్టు పట్టి లాగి గోడకు కొట్టి ఆపై ఫ్రిజ్‌కు వేసి బాదడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
Read more: Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. నాంపల్లిలో కోర్టు విచారణకు అల్లు అర్జున్ డుమ్మా.. ధర్మాసనం కీలక ఆదేశాలు..
భర్త త్రిమూర్తులు వచ్చి చూసి వెంటనే భార్యను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కానీ చాలా రక్తం పొవడంతో పాటు అంతర్గంతో పలు చోట్ల నరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో నాగమణి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విచారకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.