
కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు.
కడప జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డిగారి పల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని రాజవర్ధన్ రెడ్డి (16), జయంతి రెడ్డి (18)గా గుర్తించారు. వీరు విద్యార్థులు కాగా, బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా సరదాగా స్నేహితులతో కలిసి పాపాగ్ని నదిలోని ఇసుక క్వారీ గుంత వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలో నీటిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు లోతైన గుంతలో చిక్కుకుని మునిగిపోయారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన లోతైన నీటి గుంతలు ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News