
టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్ ఫైనల్లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న శ్రీలంక-ఏతో జరిగిన ఫైనల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి, ఇండియా-ఏ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇండియా-ఏ జట్టు 66 పరుగుల తేడాతో గెలిచి ట్రై సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌లో అంతకుముందు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన వైభవ్, కీలకమైన ఫైనల్లో మాత్రం తన సహజ శైలిలో ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సూర్యవంశీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇండియా-ఏ తొలి 9 ఓవర్లలోనే 132 పరుగులు సాధించి భారీ స్కోరుకు బలమైన పునాది వేసుకుంది. అనంతరం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఏ 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది.ఫైనల్‌కు ముందు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనే ఇండియా-ఏ సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలో వాగ్వాదానికి దిగడం కూడా చర్చనీయాంశమైంది. అటు ఫామ్ లేకపోవడం, ఇటు ప్రవర్తనపై విమర్శలు రావడంతో ఫైనల్లో అతనిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని అంతా భావించారు. అయితే, మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని