
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మన జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి . ఇటువంటి ఒక ముఖ్యమైన గ్రహ సంచారం జూన్ 22న, అంటే నేడు జరుగుతుంది. బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మన జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి . ఇటువంటి ఒక ముఖ్యమైన గ్రహ సంచారం జూన్ 22న, అంటే నేడు జరుగుతుంది. బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపార విజయాలు వంటి శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.కర్కాటక రాశిలోకి బుధుడు బుధుడిని తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు కారకుడిగా భావిస్తారు. జూన్ 22 మధ్యాహ్నం సమయంలో ఈ గ్రహం కర్కాటక రాశిలోకి మారడం వల్ల ముఖ్యంగా నాలుగు రాశులవారు లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంచారం వారి జీవితంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని చెబుతున్నారు.మిథున రాశి ఈ రాశి వారికి బుధుడు తన స్వంత రాశి అధిపతి కావడంతో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగం కనిపిస్తోంది. వ్యాపారులు కీలక ఒప్పందాలు చేసుకోవచ్చు. కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరగడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం వంటి మంచి వార్తలు రావచ్చు.కర్కాటక రాశి బుధుడు లగ్న స్థానంలోకి వస్తున్నందున వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి, నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభించి, ఉన్నతాధికారుల మద్దతు దక్కవచ్చు. సామాజిక గౌరవం పెరిగి, మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కొత్త అవకాశాలు వచ్చి చేరవచ్చు.కన్య రాశి బుధుడు లాభ స్థానంలో సంచరించడం వల్ల చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెంపు లేదా పదోన్నతి లభించవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా లాభాలు కలగడం, ఆకస్మిక ధనలాభం వంటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి.తులా రాశి బుధుడు కర్మ స్థానంలోకి వెళ్లడం వల్ల ఉద్యోగం, వృత్తిలో పురోగతి సాధ్యమవుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి మార్పు ఆలోచిస్తున్నవారికి మంచి సమయం. ఉన్నత పదవులు దక్కే యోగం ఉంది. కుటుంబ ఆస్తుల ద్వారా లాభాలు కలగవచ్చు.ఈ ఫలితాలు సాధారణ రాశి ఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశా-భుక్తుల ఆధారంగా మారవచ్చు.