
చౌటుప్పల్ గ్రామీణం: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారు
జామున కంటైనర్ వాహనం బోల్తా పడింది. హైవేపై అడ్డంగా వాహనం పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కంటైనర్లో చెన్నై నుంచి హైదరాబాద్కు సోలార్ సామగ్రి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు రెండు క్రేన్లు తీసుకొచ్చి కంటైనర్ను పక్కకు తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో కైతాపురం నుంచి బొర్రొల్లగూడెం స్టేజ్ వరకు పంపిస్తున్నారు. బోల్తా పడిన కంటైనర్ వాహనం తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలు సాఫీగా సాగే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.