
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు...
Jun 20 2026 9:17 PM | Updated on Jun 20 2026 9:17 PM
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
తమిళనాడులో టీవీకే గెలుపు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. విజయ్ సీఎం కావడంతో అక్కడ పార్టీల పొత్తుల లెక్కలు మారుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్‌బై చెప్పగా ఇప్పుడు ఆ జాబితాలో ఐయూఎంఎల్ నిలిచింది.
ఈ నిర్ణయంపై ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ మాట్లాడుతూ "ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. ద్రవిడ మోడల్ పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాము, కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఎన్నికల్లో టీవీకే పార్టీకి సంపూర్ణ మెజారిటీకి కొద్దిగా సీట్లు తగ్గినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాన్ని నివారించడానికి ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించింది," అని ఆయన వివరించారు.
తాము డీఎంకే కూటమితో కలిసి దాదాపు 60 ఏళ్లు ప్రయాణించామని, ఈ కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల రూపంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఈమేరకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధాలను తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తదుపరి దశలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. సాధారణంగా డీఎంకే వైపు మొగ్గు చూపే మైనారిటీ ఓటర్లు, ఈసారి టీవీకే వైపు మెుగ్గుచూపడం సైతం ఈ నిర్ణయానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డీఎంకే.. ఐయూఎంఎల్ బంధం ఇప్పటిది కాదు దాదాపు ఆరు దశాబ్ధాలుగా 1967 నుండి ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమితో కలిసి నడుస్తోంది. డీఎంకేకు అత్యంత నమ్మకమైన, సన్నిహిత ముస్లిం మిత్రపక్షంగా ఈ పార్టీ గుర్తింపు పొందింది. మధ్యలో 1996, 2001 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏఐఏడీఎంకే కూటమి తరపున పోటీ చేసినప్పటికీ, డీఎంకేతో దీని రాజకీయ సంబంధాలు ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వచ్చాయి.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే, ఎన్నికల అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో, ఆ పార్టీ టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అధికార కూటమిలో చేరింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానాన్ని దక్కించుకుంది.
కాగా ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి పలు మిత్రపక్షాలు దూరమయ్యాయి. గతంలోనే కాంగ్రెస్, లెఫ్ట్ (కమ్యూనిస్ట్) పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) లు డీఎంకే కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాయి. మరో మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) కూడా కూటమిలో తన స్థానంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం.
మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు)
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు)
‘నాగబంధం’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు)
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)
నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా!
Missing Case: చిన్నారి ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు
జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. ఆ 15 నిమిషాలు ఏం జరిగింది?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ
వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు