
విశాఖపట్నంలోని అశోక పార్క్ నేవీ క్యాంటీన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ ఉద్యోగి గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెంది
న మోరే పరాగ్ సురేష్ రావు(43) నేవీ క్యాంటీన్ వద్ద డీఎస్సీ (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్)గా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి నేవీ క్యాంటీన్ సమీపంలోని వెడ్ విభాగంలో టవర్-1లో సెంట్రీ విధులకు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న గన్‌తో కాల్చుకున్నారు.👉మరిన్ని వివరాలు గన్‌తో కాల్చుకొని సెక్యూరిటీ ఉద్యోగి మృతి |