
ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వస్తుందని భావించిన వెన్నుపూస సమస్యలు ఇప్పుడు హైదరాబాద్లోని యువత, ముఖ్యంగా ఐటీ రంగంలో పని చేసే యువకులు మరియు టీనేజర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హెర్నియేషన్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ ఉస్మానియా, గాంధీలలో ప్రతివారం 7 కొత్తకేసులుప్రతి వారం 6-7 కొత్త కేసులు వస్తున్నట్లు వారు వెల్లడించారు.
కార్పొరేట్ హాస్పిటళ్లలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఆధునిక జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవడం, తప్పుడు భంగిమలో కూర్చోవడం, శారీరక వ్యాయామం లోపం, ఊబకాయం, మితిమీరిన స్క్రీన్ టైమ్ వంటివి డిస్క్ బల్జ్కు దారితీస్తున్నాయి.జిమ్ చేసే వాళ్లలోనూ సమస్యలుజిమ్లలో సరైన శిక్షణ లేకుండా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కూడా యువకుల్లో తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది.
ఇటీవల ఒక 20 ఏళ్ల యువకుడు జిమ్లో భారీ బరువులు ఎత్తడం వల్ల తీవ్ర నడుము నొప్పితో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల్లో డిస్క్ ఎంబోలైజేషన్ జరిగి వెన్నుపాముకు రక్తప్రసరణ అడ్డుకోవడం వల్ల కాళ్లు బలహీనపడ్డాయని తెలిసింది.ఇలాంటి సంఘటనలు అరుదైనప్పటికీ పక్షవాతం వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు.రిస్క్ ఫ్యాక్టర్ లు ఇవేగతంలో ఇంత చిన్న వయస్సులో ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపించేవని, ఇప్పుడు సాధారణమవుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు చెప్తున్నారు.
దీర్ఘకాలం కూర్చోవడం, పోషకాహార లోపం, వంశపారంపర్యం, అధిక బరువు, ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ ప్రయాణం వంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా చెప్తున్నారు.ఈ సమస్యలు, జీవనశైలి మార్పులతో నయంనడుము నొప్పి, కాళ్లలోకి వ్యాపించే నొప్పి, మొద్దుబారడం, బలహీనత, తీవ్ర సందర్భాల్లో మూత్ర విసర్జనలో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. 80-90% కేసులు శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులు, ఫిజియోథెరపీ
ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వస్తుందని భావించిన వెన్నుపూస సమస్యలు ఇప్పుడు హైదరాబాద్‌లోని యువత, ముఖ్యంగా ఐటీ రంగంలో పని చేసే యువకులు మరియు టీనేజర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హెర్నియేషన్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ ఉస్మానియా, గాంధీలలో ప్రతివారం 7 కొత్తకేసులుప్రతి వారం 6-7 కొత్త కేసులు వస్తున్నట్లు వారు వెల్లడించారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఆధునిక జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవడం, తప్పుడు భంగిమలో కూర్చోవడం, శారీరక వ్యాయామం లోపం, ఊబకాయం, మితిమీరిన స్క్రీన్ టైమ్ వంటివి డిస్క్ బల్జ్‌కు దారితీస్తున్నాయి.జిమ్ చేసే వాళ్లలోనూ సమస్యలుజిమ్‌లలో సరైన శిక్షణ లేకుండా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కూడా యువకుల్లో తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది. ఇటీవల ఒక 20 ఏళ్ల యువకుడు జిమ్‌లో భారీ బరువులు ఎత్తడం వల్ల తీవ్ర నడుము నొప్పితో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల్లో డిస్క్ ఎంబోలైజేషన్ జరిగి వెన్నుపాముకు రక్తప్రసరణ అడ్డుకోవడం వల్ల కాళ్లు బలహీనపడ్డాయని తెలిసింది.ఇలాంటి సంఘటనలు అరుదైనప్పటికీ పక్షవాతం వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు.రిస్క్ ఫ్యాక్టర్ లు ఇవేగతంలో ఇంత చిన్న వయస్సులో ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపించేవని, ఇప్పుడు సాధారణమవుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలం కూర్చోవడం, పోషకాహార లోపం, వంశపారంపర్యం, అధిక బరువు, ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ ప్రయాణం వంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా చెప్తున్నారు.ఈ సమస్యలు, జీవనశైలి మార్పులతో నయంనడుము నొప్పి, కాళ్లలోకి వ్యాపించే నొప్పి, మొద్దుబారడం, బలహీనత, తీవ్ర సందర్భాల్లో మూత్ర విసర్జనలో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. 80-90% కేసులు శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులతో నయం చేయవచ్చన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన భంగిమ, ఎర్గానామిక్ చైర్లు, అవసరమైతే ఫిజియో థెరపీ సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.ఇక నడుం నొప్పి, డిస్క్ బల్జ్ సమస్యల నుండి బయట పడండిలాప్రతి 30-45 నిమిషాలకు ఒకసారి లేచి నడవండి. సరైన భంగిమలో కూర్చోండి (తల నిటారుగా, వీపు సపోర్ట్‌తో). క్రమం తప్పకుండా బ్యాక్ బలోపేతం అయ్యే వ్యాయామాలు చేయండి.ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగండి. జిమ్‌లో ట్రైనర్ సలహా మేరకు మాత్రమే హెవీ వెయిట్స్ ఎత్తండి.పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అటవీ సంరక్షణకు కొత్త అధ్యాయం.. అరణ్యరామం!హైదరాబాద్ లో టెకీలకు ఆరోగ్యంపై అవగాహన అవసరంహైదరాబాద్‌లో టెక్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో యువత ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరం. చిన్నప్పటి నుంచి సరైన జీవనశైలి అనుసరిస్తే ఈ సమస్యలను ఎక్కువగా అరికట్టవచ్చు. వెన్నునొప్పి లేదా అనుమానం ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.