
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Anantapur Daughter in law plea to god about her mother in law death on rs 20 note: సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య ఎక్కడైన గొడవలు, మనస్పర్థలు కామన్. వంద మందిలో ఒక పది మంది వరకు మాత్రమే.. అత్తా, కోడళ్లు అన్యోన్యంగా ఉండటం చూస్తుంటాం.
దాదాపు చాలా చోట్ల అత్తా , కోడళ్లు ఒకరిపై మరోకరు కారాలు, మిరియాలు నూరుతూ ఉంటారు. ఒకరిపై మరోకరు గొడవలు పడి, కొట్టుకొవడం వరకు వెళ్తుంటారు. వీరి మధ్య గొడవలతో చాలా కాపురాలు కూలిపోయిన ఘటనలు కొకొల్లలు. అందుకే చాలా మంది పెళ్లి తర్వాత వేరు కాపురం పెడుదామని భర్తను టార్చర్ చేస్తుంటారు.
కొంత కోడళ్లు తమ అత్తా టార్చర్ పెడుతుందని ఆమె పెత్తనం నడవాలని కోరుకుంటుందని రచ్చ చేస్తారు. మరికొన్ని చోట్ల అత్తలు మాత్రం .. తమ కొడుకును కొంగున కట్టేసుకుందని తమ ఆలన పాలన సరిగ్గా చూడటంలేదని వారి బాధలు చెప్పుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది గుళ్లకు పోయి తమకు మంచి జరగాలని, పెళ్లి, ఉద్యోగంలో రాణించాలని కోరుకుంటారు.
ఇంకా కొంత మంది చీటిల మీద తమ కోరికలు నెరవేర్చాలని రాసుకుంటారు. ఆ తర్వాత హుండీలో వేస్తారు. ఇదంతా మనం చూస్తుంటాం. కానీ ఏపీలోని అనంతపురంలో ఒక కోడలు తన అత్త టార్చర్ చేస్తుందని, ఆమెవేధింపులు ఇక భరించలేకపోతున్నానని తొందరగా ఆమె చనిపోవాలని రూ.
20 నోట్ పై రాసి ఆలయ హుండీలో వేసింది. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. అనంతపురం జిల్లా
ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా మంది భక్తులు ఎంతో నమ్ముతారు. ఇక్కడ మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ క్రమంలో ఇటీవల ఆలయంలో ఒక వింత ఘటన బైటపడింది. ఆలయ హుండీని లెక్కించగా, ఒక రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు' అని రాసి ఉండటం కన్పించింది.
Read more: Bhadradri kothagudem: బాలింత చితాభస్మంలో బైటపడ్డ కత్తెర.. భద్రాద్రి కొత్త గూడెం తల్లి, బిడ్డ మృతి ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.!.
దీంతో నోట్లు లెక్కిస్తున్న వారు ఈ ఘటనను చూసి అవాక్కయ్యారు. అది కాస్త సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ ఇలా ఉన్నారెంట్రా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.