
Samantha Pregnancy News: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత త్వరలోనే తల్లి కాబోతుందని వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ సమంత వ్యక్తిగత,వృత్తిపరమైన విషయాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఓవైపు ఆమె నటించిన సరికొత్త చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత సమంత చేసిన యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ నటనపై ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సినిమాతో సమంత తన ఖాతాలో మరో భారీ హిట్‌ను వేసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
'మా ఇంటి బంగారం' సినిమా ప్రమోషన్ల సమయంలో సమంత మోడరన్ దుస్తులకు భిన్నంగా, కేవలం సాంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే అన్ని ఈవెంట్లకు హాజరయ్యారు. ఆమెకు బేబీ బంప్ రావడం వల్లే, అది బయటకు కనిపించకుండా ఉండేందుకు ఇలా నిండుగా ఉండే చీరలను ఎంచుకున్నారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గతేడాది డిసెంబర్ 1వ తేదీన కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే ఈ తరహా వార్తలు రావడం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.
సమంత కానీ, లేదా ఆమె అధికారిక బృందం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆమె స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై