
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Venomous Snake Found in Pooja Room Video: సాధారణంగా చాలా మంది పాముల్ని నాగదేవతలా కొలుచుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా భావిస్తారు. కోబ్రాలకు ఎట్టి పరిస్థితుల్లోను అపకారం తలపెట్టొద్దని చెప్తారు. పాములకు ఆపద తలపెడితే కాలసర్పదోషాలు చుట్టుకుంటాయని చెప్తారు.
అందుకే చాలా మంది పొరపాటున ఇంటిలో పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ క్యాచర్ టీమ్ లకు సమాచారం ఇస్తారు. ఈక్రమంలో ఇటీవల పాములు ఇళ్లలోకి ఎక్కువగా వస్తున్నాయి. అంతే కాకుండా అవి సజ్జల మీద, చీకటిగా ఉండే ప్రదేశాల్లో దూరి దాక్కుంటున్నాయి.
బూట్లలో, వాహనాల్లో కూడా కోబ్రాలు దూరి హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక నాగు పాము ఏకంగా దేవుని గదిలోకి ప్రవేశించింది. అంతే కాకుండా.. కృష్ణుడి విగ్రహం ముందు నాగు పాము పడగ విప్పి చాలా సేపు అలానే బుసలు కొడుతూ ఉండిపోయింది.
ఇంతలో ఆ ఇంట్లోనివారు పామును గమనించి వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అది దేవతా సర్పం అని అక్కడి వారు దానికి పూజలు కూడా చేశారు. అక్కడి నుంచి పాము మాత్రం కదలకుండా ఉండిపోయింది. స్నేక్ క్యాచర్ పైన పలుమార్లు కాటేయడానికి ప్రయత్నించింది.చివరకు గంటల ప్రయత్నం తర్వాత కోబ్రాను స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని దగ్గరలోని అడవిలో దాన్ని తీసుకొని వదిలేశాడు.
ఈక్రమంలో ఆ కుటుంబ సభ్యులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇది దేవతా సర్పం అని కామెంట్స్ చేస్తున్నారు
.
Read more: Man VS snake fighting Video: ఏంటీ భయ్యా ఇంత వైలెంట్‌గా ఉన్నాడు.. పామును కాలితో తన్నుతూ ఫైటింగ్.. వీడియో వైరల్..
పాములతో వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి కాటు వేస్తాయని అంటారు. ఇంటి చుట్టు దట్టంగా పొదలు, చెట్లు, పనికిరాని వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఇంటి చుట్టుపక్కల డోర్లకు, కిటీకిలకు రంధ్రాలు లేకుండా చూసుకొవాలి. ఎలుకలు, కప్పలు లేకుండా చూసుకొవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ పాము కాటుల నుంచి బైటపడవచ్చు.