
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Korutla Mini Tank Bund News: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కళకళలాడి పోతోంది..
కంటికి ఇంపుగా, చూడముచ్చటైన రూపురేఖలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న కాటిల్ ఈగ్రేట్ (Cattle Egret) పక్షులు ఇప్పుడు పట్టణ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అసలు ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి. వీటి ప్రాముఖ్యత పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సంతానోత్పత్తి కోసమే ఈ రాక.. సాధారణంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే ఈ కాటిల్ ఈగ్రేట్ పక్షులు.. ప్రస్తుతం కోరుట్లలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న తుమ్మ చెట్లపై ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
ఇవి కేవలం విశ్రాంతి కోసమే కాకుండా.. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.. చెట్లపై గుంపులు గుంపులుగా చేరుతూ.. గూళ్లు కట్టుకుని, గుడ్లు పొదుగుతూ పక్షులు చేస్తున్న సందడి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ వస్తోంది..
ఆకర్షణీయమైన రంగులో.. ఈ పక్షుల ప్రత్యేకత వాటి రంగులోనే ఉంటుంది.. సాధారణ కొంగల కంటే ఇవి ఎంతో భిన్నంగా.. వీటి తల, మెడతో పాటు వీపు భాగం నారింజ, గోధుమ రంగుల సమ్మేళనంతో మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి.. పట్టణం మధ్యలో కూడా ఇటువంటి వలస పక్షులు కోరుట్లను తమ ఆవాసంగా ఎంచుకోవడం పర్యావరణ సమతుల్యతకు..
నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతూ వస్తున్నారు..
ప్రకృతి ప్రేమికుల్లో ఆనందం.. రోజూ సాయంత్రం సమయంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చే స్థానికులు.. చెట్లపై వాలి ఉన్న ఈ పక్షులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. చాలా మంది వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే, పక్షుల గూళ్లకు, వాటి సంతానోత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని.. ఈ అరుదైన పక్షులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానిక ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు పక్షుల జీవనానికి అనుకూలంగా ఉన్నాయనడానికి