
Alternative crops : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది ప్రజల జీవనాధారానికి వ్యవసాయ రంగమే వెన్నెముక అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దేశీయ వ్యవసాయం ఇప్ప టికీ ప్రధానంగా రుతుపవనాల జూదంగానే సాగుతోంది. దేశం మొత్తం మీద ఏడాది పొడవునా కురిసే వార్షిక వర్షపాతంలో సింహ భాగం, అనగా దాదాపు 75 శాతం వర్షపాతం జూన్ నుండి సెప్టెంబర్ వరకు విస్తరించే నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది.
అందువల్లనే, భారతీయ రైతాంగానికి అత్యంత కీలకమైన ఖరీఫ్ (వర్షాకాలం) పంటల విజయా పజయాలు పూర్తిగా ఈ వర్షాల పంపిణీపైనే ఆధారపడి ఉంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్)ప్రభావాలు, పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ‘ఏలి నినో వంటి తీవ్ర సముద్ర వాతావరణ పరిస్థితులు రుతుపవనాల గమనాన్ని తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయి.
దీనిఫలితంగా ఒకే ఏడాది లో కొన్ని ప్రాంతాల్లో మేఘమథనంతో కూడిన అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు లేని అనావృష్టి ఏర్పడి వర్షపాత పంపిణీలో తీవ్రమైన ప్రాంతీయ అసమతుల్యత చోటు చేసుకుంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కాలం చెల్లిన సంప్రదాయ సాగువిధానాలను పక్కనబెట్టి, మారు తున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపి కలోనూ, సాగు నిర్వహణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావలసిన చారిత్రక అవసరం నేడు రైతాంగంపై ఉంది.
శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే, ఎల్నినో అనేది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని సూచించే ఒక సంక్లిష్ట వాతావరణ ప్రక్రియ. Read Also : AP Tobacco farmers: కిలో పొగాకు రూ.200కు తగ్గకూడదు పసిఫిక్ సము ద్రంలో పెరిగే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వాతావరణ పీడన వ్యవస్థల్లో మార్పులు వచ్చి, భారతదేశానికి వర్షాలను మోసుకొచ్చే రుతుపవన గాలులు బలహీనపడతాయి.
, దేశంలో నమోదైన భయం కరమైన కరవు సంవత్సరా లలో అత్యధిక భాగం ఎల్నినో ప్రభావంతో కూడుకున్నవే నని స్పష్టమవుతోంది. ఉదాహరణకు, 2002లో ఎల్నినో కారణంగా దేశంలో 19 శాతం వర్షపాత లోటు ఏర్పడి అపార పంట నష్టం సంభవించింది. అలాగే 2009లో గత నాలుగు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన కరవు నమోదైం ది. ఆ తర్వాత 2015, ఇటీవల 2023 సంవత్సరాలలో సైతం ఎల్నినో దేశవ్యాప్త వర్షపాతంలో భారీ లోటును మిగిల్చింది, తద్వారా జలాశయాలలో నీటి మట్టాలు పడి పోయి, భూగర్భ జలాధారాలు అడుగంటి వ్యవసాయ రంగం తీవ్రసంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణంగా ఖరీఫ్సీ జన్ జూన్ మొదటి వారంలోనే ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, ఎల్నినో సంవత్సరాల్లో వర్షాలు వారాల తర బడి ఆలస్యమవడం లేదా ప్రారంభంలో కురిసి ఆ తర్వాత సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడటం సర్వసాధారణం. జూన్, జూలై నెలల్లో కురిసే తొలి వర్షాలను నమ్మి రైతులు తొందరపడి విత్తనాలు చల్లితే, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో నేలలోనే విత్తనాలు మాడిపోయి మొలకెత్తని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రైతులకు పెట్టుబడి నష్టాన్ని మిగల్చడమే కాకుండా, మళ్లీ విత్తవలసిన దుస్థితికి దారితీ స్తుంది. ఇటువంటి అనిశ్చిత సమయాల్లో వ్యవసాయ శాస్త్ర వేత్తల ప్రాథమిక సూచన ఏమిటంటే, రైతులుతొందరపాటు పడకుండా తమ ప్రాంతంలో కనీసం 75 నుండి 100 మిల్లీ మీటర్ల వరకు స్థిరమైనతగినంత వర్షపాతం నమోదై, భూమి లోపలి పొరల వరకు తేమచేరినట్లు నిర్ధారించుకున్నతర్వాతే ప్రధాన పంటలు విత్తన ప్రక్రియను ప్రారంభించాలి.
ఒకవేళ కాలంగడుస్తున్నా వర్షాలు పడకపోతే, సుదీర్ఘకాల పరిమితి గల పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడ మంచిది. ఇందు కోసం ఆయా రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలు రూపొందించే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను’ నిరంతరం గమనిస్తూ అమలు చేయాలి. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో జూన్ మాసంలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశెనగ, వరి వంటి సాంప్ర దాయ ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంటుంది. అయితే వర్షాలు జూలై మొదటివారం వరకు ఆలస్యమైతే, రైతులు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. ఎక్కువ నీరు, ఎక్కువ కాలం తీసుకునే రకాలకు బదులుగా స్వల్పకాలిక మొక్కజొన్న -రకాలు, పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాలు లేదా నువ్వులు వంటి నూనెగింజల పంటల వైపు మళ్లడం ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ వర్షాభావం మరింత తీవ్రమై జూలై రెండో పక్షం లేదా ఆగస్టు వరకు కూడా తగినంత వర్షపాతం లేకపోతే, అసలు సంప్రదాయ పంటల ఆలోచనే పక్కనబెట్టి జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరు ధాన్యాల (మిల్లెట్స్) సాగుకు శ్రీకారం చుట్టాలి. ఈ తృణ ధాన్యాలు అత్యంత తక్కువ నీటి లభ్యతతో, కరవు పరిస్థితులను సైతం తట్టుకుని అద్భుతంగా పెరుగుతాయి. పైగా ప్రస్తుత కాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల మార్కెట్లో ఈచిరుధాన్యాలకు పప్పుధాన్యాలకు అత్య ధిక డిమాండ్, మద్దతు ధర లభిస్తుండటం రైతులకు అద నపు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ అనగానే అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగుచేయడం కనిపిస్తుంది. పత్తి లాభదాయక పంట అయినప్పటికీ, దానికి ప్రారంభదశలోనూ, పూత, కాత దశ ల్లోనూ సమతుల్యమైన తేమ అవసరం. ఎల్నినో సృష్టించే వర్షాభావ పరిస్థితుల్లో పత్తి మొక్కల పెరుగుదల క్షీణించి, దిగుబడులు దారుణంగా పడిపోతాయి. కాబట్టి, వాతావరణం అనుకూలించనప్పుడు పత్తిసాగు విస్తీర్ణాన్ని ఐచ్ఛికంగా తగ్గిం చుకుని, దానికి ప్రత్యామ్నాయంగా అంతర పంటల పద్ధతి లో కంది, పెసర, మినుము వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ద్వారా పెట్టుబడిని రాబట్టుకునే వీలుంటుంది. ఇక తెలుగు ప్రజల ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు విషయానికి వస్తే, నీటి వినియోగంపై పెను మార్పులు రావాల్సి ఉంది. ఎకరానికి వేల లీటర్ల నీరు అవసరమయ్యే సంప్రదాయ వరద నీటి పద్ధతి వరి సాగుకు ఎల్నినో కాలంలో స్వస్తిచెప్పకతప్పదు. సుదీర్ఘ కాలపరిమితి గల వరిరకాల స్థానంలో 120 రోజుల లోపు పండే స్వల్పకాలిక, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అలాగే, సాంప్రదాయ పద్ధతిలో నారు పోసి, నీరు నిలగట్టి నాట్లు వేసే విధానానికి స్వస్తి పలికి, నేరుగా విత్తే వరి పద్ధతి’ లేదా ‘శ్రీ వరి విధానం’ వంటి అధునాతన నీటి పొదుపు సాంకేతికతలను అవలంబించాలి.
ఎల్నినో సృష వస్తున్న వాతావరణ మార్పులు కేవలం తాత్కాలిక సమస్య కాదు, ఇది గ్లోబల్ వార్మింగ్ సృష్టిస్తున్న దీర్ఘకాలిక సవాలు. భవిష్యత్తులో ఈ అనిశ్చితి మరింత తీవ్రరూపం దాల్చుతుందని అంతర్జాతీయపర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రైతాంగం పాతకాలపు మూస పద్ధతులకే పరిమితం కాకుండా, ఆధునిక శాస్త్రీయ సాగు విధానాలను, జల సంరక్షణ సూత్రాలను, వాతావరణ ఆధారిత వ్యవసాయ ప్రణాళికలను పంటల వైవిధ్యీకరణను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. విపత్తును సైతం ఒక అవకాశంగా మలచుకుని, సరైన సమయంలో సరైన నిర్ణ యం తీసుకునే చాకచక్యం ప్రదర్శించినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. దేశ రక్షణలో సైనికుడు ఎంత కీలకమో, దేశ ఆహార భద్రతలో అన్నదాత పాత్ర అంత కంటే మిన్న. కాబట్టి, రైతుల అప్రమత్తత, శాస్త్రీయ అవగా హనలతో పాటు ప్రభుత్వాల సకాల సాయం రాయితీలు, మౌలిక వసతుల కల్పన తోడైతే, ఎల్నినో వంటి ఎన్ని ఎల్సినోలు ఎదురైనా ఖరీఫ్ సీజన్లో రైతాం గం విజయ కేతనం ఎగురవేసి, దేశాన్ని సుభిక్షంగా ఉంచగలదనడంలో ఎటువంటి సందేహం లేదు.
Reliance AGM 2026: “జియో ఐపీఓ” పై అంబానీ క్లారిటీ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Childbirth : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం
Land values : పెరిగిన భూముల విలువలతో ఎవరికి లాభం?
Annamalai : అన్నామలై కొత్త ఒరవడిని సృష్టించగలరా?
Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా?
భారత వాతావరణ శాఖ గత వందేళ్ల చారిత్రక గణాంకాలను పరిశీ లిస్తే