దంపతుల మధ్య పొరపాట్లు జరగడం సహజం. కానీ తప్పు జరిగినప్పుడు మీ భాగస్వామి దాన్ని బప్పుకుంటున్నారా? లేదా మీపైనే ఎదురు నెట్టేస్తున్నారా? తప్పును అంగీకరించి.. సారీ చెప్పినప్పుడే భార్యభర్తల బంధంలో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది.
బాధ్యత లేనిచోట నిజమైన ప్రేమ, నమ్మకం ఏ మాత్రం ఉండవని రిలేషన్షిప్ థెరపిస్ట్ చెబుతున్నారు. కోపం, ఒత్తిడి, బాధ వచ్చినప్పుడు మీ భాగస్వామి ఎలా ప్రవర్తిస్తున్నారు? మీపై కేకలు వేస్తున్నారా లేదా మాట్లాడటం మానేసి ముడుచుకుపోతున్నరా?
మంచి భాగస్వామి అయితే, ఎంత కోపం వచ్చినా కాసేపు ప్రశాంతంగా ఉండి.. సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ కోపానికి ఇతరుల్ని బాధ్యుల్ని చేయరు. భావోద్వేగాల్ని నియంత్రించుకోలేని వారితో జీవితం చాలా మానసిక ఒత్తిడితో కూడుకుని ఉంటుంది.
భాగస్వామికి తన గురించి తనుకు పూర్తిగా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. చిన్ననాటి జ్ఞాపకాలు, గత అనుభవాలు లేదా కుటుంబ నేపథ్యం వారి ప్రస్తుత ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వారికి తెలిసి ఉండాలి. ఈ అవగాహన లేకపోతే పాత తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తారు.
తమని తాము మార్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడే బంధంలో ఎదుగుదల ఉంటుంది. అదే ప్రవర్తన కంటిన్యూ చేస్తే ఏ బంధానికైనా బ్రేకులు పడతాయి. భార్యభర్తల బంధంలో ఇద్దరి ప్రేమను వ్యక్తపరిచే శైలి ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒకరికొకరు సరిపోయేలా ఉండాలి.
ఉదాహరణకు, మీకు కలిసి సమయం గడపడం (క్వాలిటీ టైమ్) ఇష్టమైతే, భాగస్వామి మిమ్మల్ని పట్టించుకోకుండా దూరంగా ఉంటే బంధంలో దూరం పెరుగుతుంది. ఒకరి అవసరాల్ని ఒకరు అర్థం చేసుకుని, ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఎంత బిజీ లైఫ్‌స్టైల్ గడిపినా..
ఇద్దరి మధ్య క్వాలిటీ టైమ్ ఉండాలి. అంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. భార్యభర్తల బంధంలో జీవితాంతం కలిసి ఉండాలి. ఇలా జీవితాంతం కలిసి ప్రయాణించడమంటే ఇద్దరూ కలిసి మారడం. ఇద్దరిలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కానీ తప్పుల నుంచి నేర్చుకోవాలి.
కోసం మారడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరు మారడానికి మొండికేస్తే ఆ బంధం అక్కడితోనే ఆగిపోతుంది. మనసులో ఏముందో భాగస్వామికి స్పష్టంగా చెప్పగలగాలి. గొడవలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం కంటే, మారి కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.
గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.
రచయిత గురించిపుత్తా శ్రీధర్ రెడ్డిశ్రీధర్ రెడ్డి పుత్తా సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2024లో సమయం తెలుగులో చేరిన శ్రీధర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై విస్తృతమైన వార్తల్ని అందించారు. తాను ఈ విభాగాల్లో 1300కి పైగా ఆర్టికల్స్‌ను ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యే సరళమైన భాషలో రాస్తారు. శ్రీధర్ రెడ్డి పుత్తా 2018లో రచనా జర్నలిజం స్కూల్లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ న్యూస్ ఛానెల్లో (22.10.2018 నుంచి 18.11.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్ వార్తలు రాశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బులిటెన్‌ను చూసుకునేవారు. ఆ తర్వాత న్యూస్18 తెలుగు వెబ్సైట్లో (30.10.2020 నుంచి 19.09.2024 వరకు) పనిచేశారు. ఈ సమయంలో న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు స్పోర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి
బంధం