'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి.. ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘ఓం’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. అలానే పవర్ ఫుల్ టీజర్ ను కూడా లాంచ్ చేశారు.
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది. దీంతో అందరూ ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ రాజ్ కుమార్ స్పందించారు.
‘పుష్ప’ సినిమా ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు అదే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ‘ఓం’ మూవీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. వీటిపై రాజ్ కుమార్ స్పందిస్తూ.. ''కేవలం సినిమాలోని ఓ చిన్న సీన్‌ను మాత్రమే టీజర్ ను చూపించాం.
ఈ మూవీలో మరెన్నో కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు సినిమా చూశాక అవన్నీ అర్థమవుతాయి. అప్పుడు డిసైడ్ చేయండి. టైటిల్ టీజర్ చూశాక ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రేక్షకుల్లో చర్చ జరగడానికే ఈ టీజర్ ను రిలీజ్ చేశాం'' అని చెప్పారు.
‘ఓం’ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతోందని, ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయిందని రాజ్ కుమార్ పెరియసామి తెలిపారు. ఎమోషనల్ డెప్త్, కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య ధనుష్ అద్భుతమైన సమతుల్యతను పాటించారని చెప్పారు. టైటిల్ టీజర్ చివరలో వచ్చే లిరిక్స్ ధనుష్ స్వయంగా రాశారని దర్శకుడు వెల్లడించారు.
అలాగే, ధనుష్ ఒక స్పెషల్ పాటను కూడా ఇప్పటికే చిత్రీకరించామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకార్, ధనుష్ కాంబోలో ఒక అద్భుతమైన పాట రాబోతోందని చెప్పారు.'ఓం' పేరుతో ఇప్పటికే కన్నడలో ఉపేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. మళ్లీ అదే టైటిల్ తో పాన్ ఇండియా తీయడంపై రాజ్ కుమార్ మాట్లాడుతూ..
సినిమాకు దానితో ఒక సంబంధం ఉంది. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు'' అన్నారు. 'ఓం' అనే పదానికి సంస్కృతంలో 'గంజాయి' అనే మరో అర్థం కూడా ఉందని ఓ జర్నలిస్ట్ చెప్పగా.. ''ఇది నేను మొదటిసారి వింటున్నాను. కానీ ఈ సినిమాకు ఆ పేరును పూర్తిగా వేరే కారణంతో ఎంపిక చేశాం'' అని దర్శకుడు బదులిచ్చారు. 'ఓం' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నామని, ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్ మాత్రమే చిత్రీకరిస్తున్నామని, పార్ట్-1 రిలీజైన తర్వాత రెండో భాగం రూపొందిస్తామని రాజ్ కుమార్ తెలిపారు. ఈ సినిమాలో ధనుష్ తో ఓటుగా మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మమ్ముట్టి పాత్ర పేరు కార్తికేయన్ అని రాజ్ కుమార్ తెలిపారు. వుండర్‌బార్ ఫిలిమ్స్, R టేక్ స్టూడియోస్ బ్యానర్లపై తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ఓం' మొదటి భాగం ‘చాప్టర్ 1 - ఉదిరమ్: ది బ్లడ్ వుడ్’ పేరుతో దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
''ప్రతిదీ 'ఓం'తోనే మొదలవుతుంది. ఈ