నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చీమలకు ఇబ్బంది కలగజేస్తుంది. చీమలు ఉన్న ప్రదేశంలో నిమ్మరసం చల్లడం లేదా, నిమ్మరసం కలిపిన నీటితో ఇల్లు క్లీన్ చేయడంతో చీమలు రావు. వెనిగర్, నీటిని సమ భాగాలుగా తీసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసి కలపండి.
ఈ మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రే చేయండి. దీని వాసనకు చీమలు ఇంట్లోకి రావు. దాల్చిన చెక్కను పొడి చేసి వంటగది మూలల్లో ఉంచండి. దీని ఘాటైన వాసన చీమలను తరమికొడుతుంది. మిరియాల పొడి నుంచి వచ్చే ఘాటైన వాసన చీమలకు చికాకు కలిగిస్తుంది. చీమలు తిరిగే ప్రాంతంలో మిరియాల పొడి వేస్తే చీమలు రావు.
పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. చీమలు వచ్చే ప్రదేశంలో పుదీనా ఆకులు ఉంచడం, పుదీనా ఆయిల్ స్ప్రే చేయండి. దీని వాసనకు చీమలు వెళ్లిపోతాయి. కర్పూరాన్ని పొడిగా చేసి చీమలు ఉండే ప్రదేశంలో వేయండి. కర్పూరం పొడి నుంచి వచ్చే వాసనకు చీమలు తొలగిపోతాయి.
చీమలు ఉన్న ప్రదేశంలో డిటర్జెంట్ స్ప్రే చేయండి. ఇది చీమలను ఇంటి నుంచి తరిమికొడుతుంది. చీమలు ఉన్న ప్రదేశంలో టీ ట్రీ ఆయిల్‌ను స్ప్రే చేయండి. దీని నుంచి వచ్చే వాసనకు చీమలు దూరంగా వెళ్లిపోతాయి. ఇంట్లో ఉండే ఇండోర్ మొక్కల దగ్గర చీమలు ఉండే అవకాశం ఉంది.
కాబట్టి మొక్కల దగ్గర నిమ్మ తొక్కలు లేదా కాఫీ పొడి ఉంచండి
.