Infosys Share Price : లార్జ్ క్యాప్ కేటగిరిలోని ఐటీ సెక్టార్ కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ (Infosys Limited) షేర్ ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో 9 శాతానికి పైగా పతనమైంది.
సరికొత్త 52 వారాల కనిష్ట స్థాయి రూ. 1030 మార్క్ టచ్ చేసింది. దీంతో ఈ ఒక్క రోజే కంపెనీ క్యాప్ రూ. 40,000 కోట్లు తగ్గిపోయింది. మరో ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ తమ వార్షిక ఆదాయ వృద్ధి అంచనా తగ్గించడంతో ఈరోజు ఈ షేర్ ధర భారీగా పతనమైంది. ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా ఐటీ కంపెనీలు టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు భారీగా నష్టాల్లో ట్రేడయ్యాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు యథాతధంగా కొనసాగుతున్నా, ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చుల్లో కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తోందనియాక్సెంచర్ పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెంది ఐటీ షేర్స్ విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ స్టాక్ పరిశీలిస్తే, ప్రస్తుత ట్రేడింగ్ సెషన్లో ఇన్ఫోసిస్ షేరు 7.8 శాతం నష్టపోయి రూ. 1040 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 1,728 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 1030 వద్ద ఉంది.గత వారం రోజుల్లో ఈ షేరు 8 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో సుమారు 13 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 37 శాతం నష్టాన్ని మిగిల్టింది. గత ఏడాది కాలంలో 36 శాతం నష్టపోయింది. గత ఐదు సంవత్సరాల్లో 31 శాతం నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 4,31,000 కోట్లుగా ఉంది.ఇన్ఫోసిస్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద మల్టీనేషనల్ ఐటీ కంపెనీలలో ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తుంది. ఈ కంపెనీ దేశంలోని 6 అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 1981 లో ఈ కంపెనీని ప్రారంభించారు.