
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ ప్రకటన వెలువడించింది. దేశీయ టెలికం రంగాన్ని మలుపుతిప్పే కీలక ప్రకటన చేసింది. టెలికాం దిగ్గజం జియో ప్లాట్ఫామ్స్..ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు కూడా.
దీంతో ఈ సాయంత్రానికి డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ కు సమర్పించనుంది.ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. 49వ రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
కొద్దిసేపటి కిందటే రిలయన్స్ ఏజీఎం ప్రారంభమైంది. ప్రసంగం ప్రారంభంలోనే అంబానీ జియో ఐపీఓ గురించి ప్రస్తావించారు. డీఆర్హెచ్పీని బోర్డు డైరెక్టర్లు ఆమోదించినట్లు తెలిపారు. ఈషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ.. దీన్ని లీడ్ చేస్తారని పేర్కొన్నారు.ఈ ఐపీఓ ప్రకటనతో చాలా కాలంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ బహిరంగ మార్కెట్ ప్రవేశం ద్వారా రిలయన్స్ గ్రూప్ తన డిజిటల్, సాంకేతిక సేవల విలువను మరింత పెంచడమే కాకుండా, పెద్ద ఎత్తున మదుపరులకు నూతన ప్రయోజనాలను చేకూర్చేందుకు సిద్ధమవుతోంది. ఇది..
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ మెగా ఐపీఓ విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే రూ. 33,000 కోట్లకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ ప్రక్రియను ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు స్వయంగా ముందుండి నడిపించనున్నారు.
ఈ ఐపీఓ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటుందని ముఖేష్అంబానీ వివరించారు.జియో ప్లాట్ఫామ్స్ సాధించిన అద్భుత ప్రగతిని ఎండీ ఆకాష్ అంబానీ షేర్హోల్డర్లకు వివరించారు. ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య ఏకంగా 53
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ ప్రకటన వెలువడించింది. దేశీయ టెలికం రంగాన్ని మలుపుతిప్పే కీలక ప్రకటన చేసింది. టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్..ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు కూడా. దీంతో ఈ సాయంత్రానికి డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ కు సమర్పించనుంది.ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. 49వ రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కొద్దిసేపటి కిందటే రిలయన్స్ ఏజీఎం ప్రారంభమైంది. ప్రసంగం ప్రారంభంలోనే అంబానీ జియో ఐపీఓ గురించి ప్రస్తావించారు. డీఆర్‌హెచ్‌పీని బోర్డు డైరెక్టర్లు ఆమోదించినట్లు తెలిపారు. ఈషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ.. దీన్ని లీడ్ చేస్తారని పేర్కొన్నారు.ఈ ఐపీఓ ప్రకటనతో చాలా కాలంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ బహిరంగ మార్కెట్ ప్రవేశం ద్వారా రిలయన్స్ గ్రూప్ తన డిజిటల్, సాంకేతిక సేవల విలువను మరింత పెంచడమే కాకుండా, పెద్ద ఎత్తున మదుపరులకు నూతన ప్రయోజనాలను చేకూర్చేందుకు సిద్ధమవుతోంది. ఇది.. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ మెగా ఐపీఓ విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే రూ. 33,000 కోట్లకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ ప్రక్రియను ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు స్వయంగా ముందుండి నడిపించనున్నారు. ఈ ఐపీఓ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటుందని ముఖేష్అంబానీ వివరించారు.జియో ప్లాట్‌ఫామ్స్ సాధించిన అద్భుత ప్రగతిని ఎండీ ఆకాష్ అంబానీ షేర్‌హోల్డర్లకు వివరించారు. ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య ఏకంగా 53.4 కోట్లను దాటి దూసుకుపోతోందని తెలిపారు. వీరిలో ఏకంగా 26.8 కోట్ల మంది కస్టమర్లు అతి తక్కువ కాలంలోనే శరవేగంగా 5జీ నెట్‌వర్క్‌కు మారారని వెల్లడించారు. గ్లోబల్ ఇన్నోవేషన్స్ ర్యాంకింగ్‌లో దూసుకుపోతున్న అత్యుత్తమ టెక్ గ్రూపుల సరసన జియో నిలిచిందని ఆయన సగర్వంగా పేర్కొన్నారు.రిలయన్స్ 49వ ఏజీఎం సమావేశంలో షేర్‌హోల్డర్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి షేరుకు రూ. 6 డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ అధికారిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీంతో పాటు రిలయన్స్ రిటైల్ విభాగం ఐపీఓ మార్కెట్ లిస్టింగ్‌కు సంబంధించిన ముందస్తు ప్రణాళికలను కూడా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన వృద్ధి కోసం గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.రిలయన్స్ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల ట్రేడింగ్ ఒడిదొడుకులతో సాగింది. ట్రేడింగ్ ఆరంభంలో స్వల్ప నష్టాలతో రూ. 1328 వద్ద ప్రారంభమైన షేర్ ధర, మధ్యాహ్న సమయానికి రూ. 1323 వద్ద కొద్దిగా ట్రేడ్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం మార్కెట్లో రిలయన్స్ మొత్తం కంపెనీ విలువ సుమారు రూ. 17.93 లక్షల కోట్లుగా ఉంది. దాంతో భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ తన స్థానాన్ని స్థిరంగా నిలుపుకుంది.రిలయన్స్ తీసుకున్న తాజా నిర్ణయాలు పెట్టుబడిదారులు, మార్కెట్ వర్గాలకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి. జియో ఐపీఓ ఆమోదం పొంది నిధుల సేకరణకు సిద్ధం కావడం ద్వారా, టెలికాం, డిజిటల్ సాంకేతిక రంగాలలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు మార్గం సుగమం అయింది. క్లీన్ ఎనర్జీ, రిటైల్ రంగంలో కొత్త మార్పులను అందిస్తూ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ మరో భారీ విజయానికి అడుగులు వేస్తోంది.