
Bhamini: పాఠశాల విద్యార్థులతో సబ్ కలెక్టర్ ముఖాముఖి.. కీలక ఆదేశాలు! భామిని: మండలంలోని మూలగూడ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పాలకొండ సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక సదుపాయాలు మరియు పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పురోగతి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు మరియు ఇతర అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యలో రాణించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా రుచి చూసి తనిఖీ చేశారు.
భోజనం పరిశుభ్రంగా, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు
.