
Nellore: జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి! నెల్లూరు: గత15 సంవత్సరాలుగా గిరిజన విద్యాభివృద్ధికి సేవలందించిన ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఆదుకోవాలని కూటమికి అర్జీ సమర్పించారు, ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (TREI) అవుట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.
బ్రమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి. రమణయ్య మరియు సభ్యులు... జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకులను వారి నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరిస్తూ.. గత 15 సంవత్సరాలుగా గిరిజన గురుకుల పాఠశాలల్లో అత్యంత అంకితభావంతో సేవలందిస్తున్నామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి కోసం ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ, విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడం నుంచి వారి సంక్షేమం వరకు బాధ్యతగా వ్యవహరించామని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం కోసం ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే విధులకు చేరుకుని, సాయంత్రం మాత్రమే కాకుండా అవసరమైతే రాత్రి సమయాల్లో కూడా హాస్టళ్లలో విద్యార్థులతోనే గడుపుతూ ఇద్దరు ఉపాధ్యాయులు నిరంతరం అందుబాటులో ఉండేవారమని తెలిపారు.
విద్యార్థులను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ సేవలందించినప్పటికీ, నేడు ఉద్యోగ భద్రత లేక నిరాదరణకు గురవుతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెలకు కేవలం రూ.5 వేల వేతనంతో ఉద్యోగాల్లో చేరిన తాము, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నమ్ముకొని ఇన్నేళ్లు కొనసాగామని తెలిపారు.
ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసి ఉంటే అడ్మిషన్ల ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలు, మెరుగైన వేతనాలు, పదోన్నతులు పొందే అవకాశాలు ఉండేవని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకంతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన తమకు ఇప్పుడు న్యాయం చేయాలని కోరారు.
సంధ్యారాణి సూచనల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం డీఎస్సీ నియామకాల అనంతరం సుమారు 788 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఎంపిక కావడంతో, దాదాపు 650 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పోటీ పరీక్షలు రాసే అవకాశం కోల్పోయామని, ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించినప్పటికీ పలువురికి వయోపరిమితి దాటిపోయిందని వివరించారు. సింగిల్ పేరెంట్ మహిళలు సహా అనేక కుటుంబాలు ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు.
గిరిజన విద్యాభివృద్ధికి తమ జీవితంలో విలువైన సంవత్సరాలను అంకితం చేసిన ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని కోరారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఉన్న నిబంధనలను గౌరవిస్తూనే, బాధిత ఉపాధ్యాయులకు విద్యాశాఖ లేదా ఇతర అనుబంధ విభాగాల్లో తగిన అవకాశాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.
వారి వినతిని మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడటం జనసేన పార్టీ సిద్ధాంతమని, బాధిత ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో డీఎస్సీ అర్హత నిబంధనల కారణంగా 1,446 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించిన సమయంలో కూటమి నాయకులను ఆశ్రయించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి