
నవతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్లాన్ వేశారు. తన 'కల్కి' సీక్వెల్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే అందులోని కీ రోల్స్ తో వన్ అవర్ మూవీస్ రూపొందిస్తారట. వాటిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశాకే 'కల్కి' సీక్వెల్ థియేటర్స్ లో వెలుగు చూస్తుందట.
వింటూంటేనే భలేగా ఉంది కదూ !? నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడి'లో మహాభారతంలోని శ్రీకృష్ణ, కర్ణ, అర్జున, అశ్వత్థామ పాత్రలను చొప్పించి కథ రూపొందించారు. వీటితో పాటు యక్షిన్ పాత్రలో కమల్ హాసన్ ను చూపించారు. ఈ పాత్రల పూర్వపరాలను తెలియజేస్తూ కొన్ని చిత్రాలను రూపొందించనున్నారట.
ఈ సినిమాలన్నీ ఒక్కోటి గంట నిడివితో తెరకెక్కుతోందట. వీటిలోనే శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన శాపం వెనుక అసలు కథను, కర్ణుడు, అర్జునుడు పోరాడిన వైనాన్ని వారి ముందు జన్మల కథలను చూపిస్తారని తెలుస్తోంది. ఇలా ఇందులోని మరికొన్ని ప్రధాన పాత్రలపై కూడా సినిమాలను రూపొందిస్తారట.
వీటిని 'కల్కి' సీక్వెల్ కు ముందు ఓటీటీలో రిలీజ్ చేస్తారట. దాంతో ప్రేక్షకులకు ఈ పాత్రలపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావించారని సమాచారం. ప్రస్తుతం 'కల్కి' సీక్వెల్ షూటింగ్ సాగుతోంది. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్, యక్షిన్ గా నటించిన కమల్ హాసన్ పై ఇప్పటికే ప్రధానమైన సీన్స్ ను రూపొందించారట.
ప్రభాస్ తన తాజా చిత్రాల షూటింగ్స్ పూర్తి కాగానే 'కల్కి' సీక్వెల్ లో నటిస్తారట. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం షూటింగ్ జరుపుకుంటూ పోతున్నారు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాకు ఈ సారి ఫ్రాంచైజీకి సంబంధించిన బొమ్మలు, కాస్ట్యూమ్స్ తో మార్కెట్ కూడా చేయాలని భావిస్తున్నారట.
అలా 'కల్కి' మొదటి భాగం కన్నా మిన్నగా సీక్వెల్ పై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో 'ఫౌజీ' ముందుగా ఈ యేడాది
డిసెంబర్ లోనే వెలుగు చూడనుందట. తరువాత 'స్పిరిట్'ను వచ్చే సంవత్సరం సరైన సమయంలో రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. ఆ సినిమా వచ్చాకే 'కల్కి' సీక్వెల్ ను విడుదల చేసేందుకు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. అందువల్లే ముందుగా 'కల్కి' సినిమాలోని ప్రధాన పాత్రల పూర్వపరాలతో రూపొందే గంట నిడివి సినిమాలను రిలీజ్ చేస్తారని వినిపిస్తోంది. మరి ఈ గంట సేపు సాగే చిత్రాలు జనాన్ని ఏ తీరున మురిపిస్తాయో చూడాలి.
Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య
NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది