
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు తెరలేచింది. ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం ‘జియో ప్లాట్‌ఫామ్స్’ ఐపీఓకు వెళ్లేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ రోజే సెబీకి సమర్పించబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దివంగత ధీరూభాయ్ అంబానీ ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్లినట్లే ఇప్పుడు తన వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీలు ఈ జియో ఐపీఓ ప్రక్రియను ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు.
భవిష్యత్తులో సరికొత్త వృద్ధి అవకాశాలకు వారు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. గ్లోబల్ స్థాయిలో సాంకేతిక కంపెనీలను భారత్ నిర్మించగలదని ఈ జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుందన్నారు.పదేళ్ల క్రితం భారత్‌లో వాయిస్ కాల్స్, డేటా ధరలు అధికంగా, స్పీడ్ చాలా తక్కువగా ఉండేవని ముకేశ్ గుర్తుచేశారు.
దేశంలో ‘డిజిటల్ అసమానతలను’ తొలగించాలనే లక్ష్యంతోనే జియో ప్రయాణం మొదలైందని తెలిపారు. వాయిస్ కాల్స్‌ను పూర్తిగా ఉచితం చేసి హై-స్పీడ్ డేటాను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి భారతీయుడికి ‘డిజిటల్ లైఫ్’ను సాధ్యం చేసిన జియో..
ఇప్పుడు తన తదుపరి పెద్ద మిషన్‌కు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.ఈ జియో ఐపీఓ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవబోతోంది. నివేదికల ప్రకారం.. ఈ ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ అంచనా ప్రకారం రిలయన్స్ జియో మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.15,12,000 కోట్లుగా