
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 ఏళ్లుగా తన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషిని ఒక వైద్యుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఢిల్లీలోని మౌంట్ కైలాష్ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఉదంతం వెలుగుచూసింది. 50 ఏళ్ల చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మనీష్ గుప్తా, తన ఇంట్లో పనిచేస్తున్న మీనా (45) అనే మహిళను క్రికెట్ బ్యాట్‌తో బాది, కత్తితో పొడిచి చంపాడు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.మీనా గత 15 ఏళ్లుగా మనీష్ ఇంట్లో పనిచేస్తోంది. గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో బట్టలు ఆరేసేందుకు ఆమె ఇంటి టెర్రస్‌పైకి వెళ్లగా, వెనుకే వెళ్లిన డాక్టర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పొరుగువారు టెర్రస్‌పై రక్తపు మడుగులో ఉన్న మీనా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, మృతదేహం పక్కనే డాక్టర్ కూర్చుని ఉన్నాడు. "నన్ను ఉరితీయండి" అని పోలీసులతో అన్నాడు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన క్రికెట్ బ్యాట్, కిచెన్ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డాక్టర్ మనీష్ గత పదేళ్లుగా డిప్రెషన్, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది.
ఈ మధ్యకాలంలో అతను మందులు వాడటం నిలిపివేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు చేతబడి చేసిందని, ఆమె వల్ల తన కుటుంబ శాంతి, కొడుకు చదువు దెబ్బతిన్నాయని మనీష్ ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు ఆ వాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.మీనాను పనిలోంచి తొలగించే