
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ '#NBK111' నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోందని టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
అంతేకాదు, ఈరోజు కాజల్ బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే కాజల్.. ఈ పోస్టర్లో పక్కా డీసెంట్ అండ్ ఇంటెన్సివ్ లుక్‌లోకి మారిపోయింది. నీలిరంగు గళ్ళ చీర, కళ్లద్దాలు పెట్టుకుని, జుట్టు ముడివేసి ఒక పవర్ఫుల్ ప్రభుత్వ అధికారిణిలాగా లేదా ఒక సీరియస్ లాయర్ లాగా కనిపిస్తోంది.
ఆమె వెనుక ఉన్న పాత రోజుల నాటి ఆఫీస్ సెటప్, టేబుల్‌పై ఉన్న ఫైళ్లు చూస్తుంటే.. బాలయ్య సినిమాలో కాజల్ క్యారెక్టర్‌కు చాలా వెయిట్ ఉందని అర్థమవుతోంది. గతంలో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు
.