
సమంత ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ కథలను ఎక్కువగా చేస్తూ వెళుతోంది. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' .. 'యశోద' వంటి సినిమాలు సమంత క్రేజ్ ను మరింత పెంచాయి. ఎలాంటి కథలనైనా .. పాత్రలనైనా సమంత సమర్థవంతంగా నడిపించగలదని ఈ సినిమాలు నిరూపించాయి.
ఈ నేపథ్యంలో ఆమె చేసిన నాయికా ప్రధానమైన సినిమానే 'మా ఇంటి బంగారం'. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. సమంత భర్త రాజ్ నిడుమోరు అందించిన ఈ కథ ఎంతవరకూ వర్కౌట్ అయింది? అది 'బల్లవరం' అనే ఒక విలేజ్.
అక్కడ రాజకీయనాయకుడిగా .. మంచి మనిషిగా రామరాజు (ఆనంద్)కి పేరు ఉంటుంది. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అనిరుధ్ (దిగంత్) ఓ డాక్టర్. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మూడేళ్లుగా తన వాళ్లకు దూరంగా ఉంటూ ఉంటాడు. చిన్న కొడుకు శరత్, ఓ పోలీస్ ఆఫీసర్.
అతని భార్య అనసూయ (శ్రీముఖి). రామరాజు కూతురు 'గీత' పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండటంతో, స్వర్ణ (సమంత)ను వెంటబెట్టుకుని అనిరుధ్ ఆ ఊరు వస్తాడు. తన పట్ల తండ్రి కోపం ఇంకా తగ్గలేదనే విషయం అతనికి ఆ తరువాతనే అర్థమవుతుంది. సంప్రదాయ బద్ధమైన ఫ్యామిలీ ..
పద్ధతిగల ఫ్యామిలీ కావడంతో స్వర్ణను తమతో కలుపుకోవడానికి వాళ్లంతా సంశయిస్తూ ఉంటారు. వాళ్లకి ఇష్టమైన పనులను చకచకా చేసి మెప్పించాలని స్వర్ణ భావిస్తుంది. తన కోసం ఫ్యామిలీకి దూరమైన అనిరుధ్ ని, తానే ఆ కుటుంబానికి చేరువ చేయాలని భావిస్తుంది.
అందుకోసం తన స్నేహితురాలు కిరణ్మయి సలహా తీసుకుంటుంది. స్వర్ణ వ్యవహార శైలిపట్ల అనసూయ అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా, 'రాజమండ్రి' సెంట్రల్ జైల్లో కరుణ (గుల్షన్ దేవయ్య) శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అతను జైల్లో ఉండే బయట ఉన్న తన అనుచరులతో చక్రం తిప్పుతుంటాడు.
'ఝాన్సీ'
ఎక్కడ ఉందనేది వాళ్లతో వెతికిస్తుంటాడు. ఝాన్సీ ఇప్పుడు 'స్వర్ణ' అనే పేరుతో 'బల్లవరం' విలేజ్ లో ఉందని తెలుసుకుంటాడు. ఆమె అంతు తేల్చాలనే పట్టుదలతో జైలు నుంచి తప్పించుకుంటాడు. కరుణ ఎవరు? అతనితో స్వర్ణకి గల గొడవేంటి? అంతకు ముందు ఝాన్సీపేరుతో ఆమె చేసినదేంటి? అనేది మిగతా కథ. 'మా ఇంటి బంగారం' .. చూడటానికి ఇది టీవీ ఛానల్స్ వారు పెట్టే కాంటెస్ట్ టైటిల్ మాదిరిగా, టీవీ సీరియల్ టైటిల్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ ట్రైలర్ లో సమంత ఫైట్స్ ఒక రేంజ్ లో ఉండటం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఆ టైటిల్ ఏంటి? ఈ ఫైట్స్ ఏంటి? అనే సందేహానికి సమాధానం కోసం థియేటర్స్ కి వెళ్లారు. అలా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాల కథలను పరిశీలన చేస్తే, మాస్ హీరోలకు ఓ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ ప్రస్తుతం వాళ్లు చాలా సాఫ్ట్ గా .. కూల్ గా .. తమ ఉనికి బయటపడటం కూడా ఇష్టం లేకుండా చాలా సాదాసీదాగా బ్రతికేస్తుంటారు. దాంతో ఆ హీరో గతంలో ఏం జరిగింది? ఎందుకు అతను తనకి తాను తగ్గిపోయి ఒక యోగిలా బ్రతికేస్తున్నాడనే ఆసక్తి ఆడియన్స్ లో పెరుగుతూ పోతుంది. అలాంటి ఒక ఉత్కంఠను పెంచే కథనే ఇది. కాకపోతే హీరోల స్థానంలో మనకి సమంత కనిపిస్తుందంతే.భర్తతో కలిసి అత్తగారింటికి వచ్చిన అమాయకురాలైన స్వర్ణ, ఆ ఇంట్లో వాళ్లతో కలిసిపోవడానికి .. శభాష్ అనిపించుకోవడానికిపడే ఆరాటం తాలూకు సన్నివేశాలతో ఈ కథ సరదాగా మొదలవుతుంది. ఎప్పుడైతే జైల్లో ఉన్న విలన్, స్వర్ణ పేరుతో ఉన్న ఝాన్సీని తన అనుచరులతో వెతికించడం మొదలుపెడతాడో అక్కడి నుంచి కథ మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. స్వర్ణలో బయటికి కనిపించని ఝాన్సీ కోణం, కథపై ప్రేక్షకులు మరింత శ్రద్ధ పెట్టేలా చేస్తుంది. అత్తగారింట్లో అమాయకురాలైన స్వర్ణగా గుట్టుగా రోజులు నెట్టుకొస్తున్న ఝాన్సీ అంతు చూడటం కోసం విలన్ ఆ ఊళ్లోకి అడుగుపెట్టడంతో కథ మరింత ఉత్కంఠను అందుకుంటుంది. ఇక ఆ తరువాత జరిగే అనూహ్యమైన పరిణామాల మధ్య సెకండాఫ్ వేడెక్కుతుంది. ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణాన్ని దాటుకుని, ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దిశగా ఈ కథ పరిగెడుతుంది. స్వర్ణలో దాగిన ఝాన్సీని ఈ ఎపిసోడ్స్ పూర్తిగా చూపిస్తాయి. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కార్ ఛేజింగ్ .. రన్నింగ్ లో ఉన్న బస్సులో ఫైట్ .. క్లైమాక్స్ లో సమంత యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. క్లైమాక్స్ జరుగుతున్నప్పుడు మనకి 'జైలర్' సినిమా గుర్తుకు రాకుండా ఉండదు. సమంత .. గుల్షన్ దేవయ్య పోటీపడి చేశారనే చెప్పాలి. ఆరంభంలో సమంత మరీ సన్నబడిపోయి కనిపించినప్పటికీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి ఫరవాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీ .. యాక్షన్ పాళ్లను కలిపి ఈ సినిమాను అందించడంలో నందినీ రెడ్డి చాలావరకూ సక్సెస్ అయ్యారని చెప్