గూగుల్ పిక్సెల్ 7లో టెన్సర్ G2 ప్రాసెసర్ సెటప్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఆప్షన్ 6.30-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ప్లే Google Pixel 7 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
మీ బడ్జెట్ రూ. 30వేల కన్నా తక్కువగా ఉంటే ఈ అద్భుతమైన డీల్ మీకోసమే. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇందులో ఆక్టా-కోర్ టెన్సర్ G2 ప్రాసెసర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 7 ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరలకు (Google Pixel 7) సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. గూగుల్ పిక్సెల్ 7 ధర, ఆఫర్లు : గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 29,499 ధరకు లభిస్తోంది.
ఈ ఫోన్ అక్టోబర్ 2022లో రూ. 59,999 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా HSBC క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ. 1,474 వరకు) లభిస్తుంది. దాంతో ధర రూ. 28,024కి తగ్గుతుంది. మీ దగ్గర పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధర రూ.27,650 వరకు తగ్గించుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారుగా రూ. 31,975 తక్కువకే లభిస్తోంది. Read Also : Vivo X Fold 6 : మడతలో మ్యాజిక్.. బ్యాటరీలో బీస్ట్.. వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది!
పిక్సెల్ 7 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.30-అంగుళాల ఫుల్ HD+ OLED
డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆక్టా-కోర్ టెన్సర్ G2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా పరంగా పరిశీలిస్తే.. పిక్సెల్ 7 బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 10.8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. పిక్సెల్ 7 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. గూగుల్ ఎక్స్ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్‌తో 72 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.