
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Vijayawada police filed case on ci Nagaraju over custodial death case: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. గాదె సాయికృష్ణ ను విజయవాడ కృష్ణలంక జైలులో సీఐ నాగ రాజు టార్చర్ చేసి చంపేశాడని తల్లి ఆరోపణలు చేసింది.
కనీసం చివరి చూపు, చితా భస్మం కూడా దొరక్కుండా చేశాడని గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుంది. ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదే పీఎస్ లో మరో యువకుడు క్రాంతి కుమార్ సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కూడా మాట్లాడారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహరం కాస్త కూటమి ప్రభుత్వంకు పెద్ద తలనొప్పిగా మారింది.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విజయవాడకు సీపీతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో గాదె సాయికృష్ణ కేసు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా సీపీ రాజశేఖర్ బాబు కంప్లైంట్ తీసుకున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేశారు. కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ ను కమిషనర్
రాజశేఖర్ బాబు నియమించారు. సీఐ నాగరాజుపై.. CR No - 107/2026 u/s 127(4) 127(6) 103(1) bns 238 bnss సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read more: సాయి కృష్ణ కేసులో ఏ1గా సీఎం చంద్రబాబు, ఏ2గా హోంమంత్రి అనిత.. కేసుల నమోదుకు మాజీ మంత్రి డిమాండ్
ప్రత్యేక టీమ్ విజయవాడ కృష్ణలంక పీఎస్ కు వెళ్లి క్లూస్ టీమ్ తో జైలులో ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. మొత్తంగా సీఐ నాగరాజును మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్సార్సీకి మాత్రం ఈ ఘటనపై కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కు పెట్టింది.
అయితే.. మే 9న మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం, జూన్ 29లోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.