
Motorola Edge 60 Fusion 5g Flipkart Deals: ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్ రూ.13,999కే అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే చాలా చీప్ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 60 Fusion 5g Flipkart Deals: అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లలో నిత్యం డే సేల్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో స్మార్ట్ఫోన్స్తో పాటు ఇతర వస్తువులు లభిస్తాయి.
ముఖ్యంగా ఇందులో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ అత్యంత తక్కువ ధరల్లో ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్స్‌తో లభిస్తాయి. ముఖ్యంగా Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.
ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ డే డీల్స్‌లో భాగంగా అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా బేస్ వేరియంట్‌పై స్పెషల్‌గా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..
6.67 అంగుళాల (6.67-inch) Super HD+ pOLED క్వాడ్-కర్వ్డ్ (Quad Curved) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 4500 nits బ్రైట్నెస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్బుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనకాలో Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్‌తో కూడిన 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 13 MP అల్ట్రావైడ్‌తో పాటు మాక్రో కెమెరా లభిస్తున్నాయి.
కాకుండా ఎన్నో రకాల కెమెరా ఫిల్టర్స్ ఫీచర్స్‌తో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500mAh పెద్ద బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.. దీనికి 68W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మోటోరోలా దీనికి 3 ఓఎస్ అప్గ్రేడ్లు ఇస్తామని ప్రామిస్ చేసింది. ఇందులో కంపెనీ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా లభిస్తున్నాయి..
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G బేస్ వేరియంట్ ధర MRP రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.2,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. దీంతో ఇది కేవలం రూ.22,999 లోపే సొంతం చేసుకోవచ్చు.
అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా Flipkart యాక్సిస్ బ్యాంక్‌తో పాటు SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,150 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.9,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.13,999కే పొందవచ్చు.
ఫ్రంట్ భాగంలో సెల్ఫీల కోసం 32 MP కెమెరాను అందించారు. ఇవే