
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం విఫలమైతే ఏం చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘ఒప్పందం సఫలమైతే ఆ ఘనత నా ఖాతాలో వేసుకుంటా.. విఫలమైతే ఆ నింద జేడీ వాన్స్ (J.D.
Vance)పై వేస్తా’నంటూ నవ్వుతూ బదులిచ్చారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉపాధ్యక్షుడికి సూచించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో టెహ్రన్ ఎలాంటి షరతులు విధించకుండానే లొంగిపోయిందని పేర్కొన్నారు. హర్మూజ్ మూసివేతతో ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడడంతో..
ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం బారి నుంచి కాపాడేందుకు తానే చర్చలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ఘర్షణ మరింత విస్తృత ఆర్థిక విపత్తుగా మారకుండా నివారించడానికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
తన శక్తికి, అధికారానికి పరిమితులు లేవని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఇజ్రాయెల్‌పై సానుభూతి ఉన్న ఏకైక దేశాధినేత ట్రంప్ మాత్రమేనని పేర్కొన్నారు.
అమెరికా డబ్బుతోనే ఇజ్రాయెల్ అభివృద్ధి చెందుతోందన్నారు. తమ అతిపెద్ద సమస్య అమెరికా అధ్యక్షుడే అని ఇజ్రాయెల్‌లో ఎవరైనా అనుకుంటే.. వారు ఇప్పటికైనా మేల్కొని తమ దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితిని గ్రహించాలని సూచించారు. ఇరాన్-అమెరికా చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ క్యాబినెట్‌లోని జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ పేర్కొన్న నేపథ్యంలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు