
ఇంటర్నెట్‌డెస్క్: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. పరీక్ష (NEET-UG Re Exam)ను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.
దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరఫు న్యాయవాదులు కోరగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది.
నీట్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లను జస్టిస్ పీఎస్. నరసింహ ధర్మాసనం ముందుకువెళ్లాయని.. ఈ పిటిషన్లను కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. అభ్యర్థులు లేవనెత్తిన విషయాల్లో అత్యవసరస్థితి లేదని సీజేఐ పేర్కొన్నారు. ఇక, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న లీకేజీ రూమర్ల కారణంగా దాదాపు 1600 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
జూన్ 21న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో కూడా సమస్యలు ఉన్నాయని వాదించారు. అయితే, ధర్మాసనం వీటన్నింటినీ తోసిపుచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.