
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది.
సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. అమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.