
అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు అతడికి నాలుగు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
జూన్ 18 నుంచి 21 వరకు బెయిల్‌పై విడుదల చేసి, జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.ప్రస్తుతం నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న ఈ యువకుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద రేప్ కేసుతో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాధితురాలు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.
అయితే, బెయిల్‌పై ఉన్నప్పుడు నిందితుడు తనను గానీ, తన కుటుంబాన్ని గానీ బెదిరించబోనని హామీ ఇవ్వాలని షరతు పెట్టింది. దీంతో కోర్టు రూ.50,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్ విశ్వాస్ జోడ్గే, నేరస్తులకు పునరావాసం కల్పించడం న్యాయ వ్యవస్థ లక్ష్యమని అన్నారు.
వైద్య ప్రవేశ పరీక్ష రాసేందుకు యువకుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం అవసరమని, పోలీస్ ఎస్కార్ట్‌తో పరీక్షకు హాజరైతే అతని మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని వాదించారు.అయితే, ఈ పిటిషన్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చైత్రాలి పాన్షికర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, కేవలం ఒక్కరోజు పోలీస్ భద్రత