
పంట బాగా రావాలంటే మంచి విత్తనం, నీరు, ఎరువులు అవసరం. కానీ వాటిలోని పోషకాలు నేలలో ఎలా వ్యవహరిస్తాయి? మొక్కలకు అవి ఎలా అందుతాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. నేలలో ఉండే సూక్ష్మజీవులే పెద్ద మొత్తంలో ఫాస్ఫరస్‌ను తమలో దాచుకుని తిరిగి మొక్కలకు అందేలా చేస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది.వ్యవసాయానికి అత్యంత కీలకమైన పోషకాల్లో ఫాస్ఫరస్ ఒకటి.
నత్రజని, పొటాషియం తర్వాత పంటలకు ఎక్కువ అవసరమయ్యే మూలకం ఇదే. వేర్ల పెరుగుదల, పుష్పాలు, గింజల తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫాస్ఫరస్ నిల్వలు నేలపై పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగించే ఫాస్ఫేట్ రాళ్లు పునరుత్పత్తి కాని వనరులు.
భవిష్యత్తులో ఇవి తగ్గిపోతే ఎరువుల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నేలలోని ‘డీఎన్ఏ-బౌండ్ ఫాస్ఫరస్’పై అధ్యయనం చేసింది. ఇది నేలలోని సూక్ష్మజీవుల డీఎన్ఏలో ఉండే ఫాస్ఫరస్ రూపం.
ఇప్పటి వరకు ఈ ఫాస్ఫరస్ పరిమాణాన్ని గుర్తించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిశోధకులు దాన్ని కొలిచేందుకు మరింత సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని బ్రిటన్‌లోని 32 రకాల నేలలపై పరీక్షించారు.పరిశోధనలో మరో ఆసక్తికర విషయం బయటపడింది.
నేలలోని ఈ ఫాస్ఫరస్ పాత నిల్వల్లో కాకుండా జీవించి ఉన్న సూక్ష్మజీవులతో ముడిపడి ఉందని తేలింది. అంటే ఇది స్థిరంగా ఉండే నిల్వలు కాదు. నేలలోని సూక్ష్మజీవులు నిరంతరం వినియోగిస్తూ మళ్లీ విడుదల