
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సీఈవో రాజేశ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కనీసం మరో మూడు, నాలుగేళ్లు ఆర్సీబీ తరఫున ఆడతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కోహ్లీలో ఆట పట్ల ఆకలి, ఫిట్నెస్ ఏమాత్రం తగ్గలేదని, అతని రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండబోదని స్పష్టం చేశారు. ఆటగాడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ ఆర్సీబీతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడని చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ రాజేశ్ మీనన్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"ఆర్సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. కోహ్లీ లేని ఆర్సీబీని ఊహించుకోలేను. అయితే, రాబోయే మూడు, నాలుగేళ్లలో అతను ఖచ్చితంగా ఆడతాడు. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతనిలోని ఆకలి ఎప్పటికీ చావదు. ఈ ఐపీఎల్ సీజన్లో మీరు అతని ఎనర్జీ, పరుగులు, దూకుడు అన్నీ చూశారు.
కాబట్టి మరో నాలుగు సంవత్సరాలు ఆడటంలో ఎటువంటి సందేహం లేదు" అని మీనన్ పేర్కొన్నారు.రాజేశ్ మీనన్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఐపీఎల్ 2026 సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఈ టోర్నీలో 675 పరుగులతో నాలుగో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
ముఖ్యంగా తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమంగా 165.84 స్ట్రైక్ రేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి, ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కీలక