
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. కేసముద్రం(మహబుబాబాద్): మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.
గురువారం మార్కెట్‌కు 27 మంది రైతులు 643 బస్తాల ధాన్యం తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.3,236, కనిష్ఠంగా రూ.1889, సగటున రూ.2721 ధరలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఆల్‌టైం రికార్డు గరిష్ఠ ధర నమోదు కావడం విశేషం.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ కిష్టాపురానికి చెందిన మహిళా రైతు ఆగె మోహనమ్మ ఆరు బస్తాల ధాన్యం తీసుకురాగా, క్వింటాకు రూ.3236 ధర రావడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది. గరిష్ఠ ధర ఒకే రైతుకు దక్కినప్పటికీ ధాన్యం ధర రూ.3వేల మార్కు దాటింది.
ఇక సగటు ధర బుధవారం రూ.2,589 ఉండగా తాజాగా రూ.2,721కి పెరగడం గమనార్హం. సింగరేణిలో క్వాలిటీ యంత్రాలు లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News