
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Sai Krishna Case Updates: సాయి కృష్ణ కేసులో సీఎం చంద్రబాబు నాయుడిని ఏ1గా.. హోంమంత్రి అనితపై ఏ2గా కేసు పెట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే భయం వేస్తోందన్నారు.
సాయి కృష్ణ ఘటన చూసుకుంటే రాష్ట్రానికి భవిష్యత్ ఉండే అవకాశం లేదన్నారు. గాదె సాయి కృష్ణ అనే 23 ఏళ్ల యువకుడిని కృష్ణ లంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. అతని తల్లిని పలుమార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారని అన్నారు. ఆ తల్లి తన బిడ్డ ఎక్కడ అనే అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయి కృష్ణ తల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన తర్వాత యువకుడిని హత్య చేసి కాల్చి బూడిద చేశారని తెలిసిందన్నారు. 79 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఏ ప్రభుత్వంలో చూసి ఉండరని అన్నారు. "ఇటువంటి చేతకాని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చినందుకు సిగ్గుపడుతున్నాం.
ముఖ్యమంత్రి కొడుకు అంబేడ్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. నిన్నటి వరకు కల్లిబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హడావిడిగా కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిపై కోర్టు వారెంట్ ఉంటే మీరు ఎలా చిత్ర హింసలు పెడతారు.
ఆ తల్లి శోకం చూస్తుంటే రాష్ట్ర ప్రజల హృదయాలు తరుక్కుపోతున్నాయి. చేతకాని ప్రభుత్వం.. చేతకాని పోలీసులు వల్ల ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. ఎవరిపైన అయితే వారిపైనే గత రెండు సంవత్సరాలుగా కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ కాస్త సినిమా పోలీస్ వ్యవస్థలా
తయారైంది. డీజీపీ,హోంమంత్రి, లోకేష్, ముఖ్యమంత్రిపైన కేసులు పెట్టాలి. ఒక ఐజి స్థాయి అధికారిని తీసుకు వస్తే ఏమి వివరాలు వస్తాయి. గతంలో బీహార్‌లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. కేసులు ఉంటే చంపే అధికారం ఎవరీచ్చారు..? 70 వేల సీసీ కెమెరాలో రాష్టంలో ఏర్పాటు చేశామని చెప్పారు. మే 9 నుంచి ఇప్పటివరకు జరిగిన దానిపై కృష్ణ లంకలో ఉన్న సీసీ ఫుటేజీని బయటకు తీయండి.
నాలుగేళ్ల చిన్నారి తప్పిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందో తెలీదు. పక్కా నియోజకవర్గంలో జరిగితే హోంమంత్రి వెళ్లి పరామర్శించడానికి 12 రోజులు పట్టింది. లాకప్ డెత్ జరిగితే దానిని మేకప్ చేసే ప్రయత్నం. ఇంకా మీరు దేనిని మేకప్ చేసే పరిస్థితులు లేవు. త్వరలోనే ప్రజలు మీకు ప్యాకప్ చేసే రోజులు వస్తాయి. సాయి కృష్ణ విషయంలో ఒక సీఐని బలి పశువును చేశారు. దాని వెనుక ఉన్న ఇతర అధికారులు, హోంమంత్రిపై కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎక్కడ శవమై బయటకు వస్తామో అని భయం నెలకొంది.
సాయి కృష్ణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కాదు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాం. వంగా వీటి మోహన రంగ హత్యకు డిసెంబర్ 26 ముందు రోజు రాత్రి అప్పటి పోలీస్ అధికారి వ్యాస్ చెప్పిన మాటలు.. అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు ముందురోజు సమావేశం అయ్యారని ఒక మాజీ పోలీస్ అధికారే చెప్పారు. మహా నాయకుడైన వంగవీటి మోహన్ రంగను హత్య చేసిన తెలుగుదేశం పార్టీ.. సాయి కృష్ణను హత్య చేయదా..? సాయి కృష్ణ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది" అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.